AP SSC Halltickets: పదోతరగతి పరీక్షల హాల్‌టిక్కెట్లు వచ్చేశాయ్, డైరెక్ట్ లింక్ ఇదే
SSC Halltickets: ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌టిక్కెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో పాఠశాలల లాగిన్ వివరాలతోపాటు విద్యార్థులు తమ వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లను పొందవచ్చు.

AP SSC Exams Halltickets: ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌టిక్కెట్లు మార్చి 3న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అలాగే మన మిత్ర ప్రభుత్వ వాట్సాప్ సేవ 9552300009 ద్వారా కూడా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వ తెలిపింది. విద్యార్థులు తమతమ పాఠశాలల లాగిన్ వివరాలతోపాటు.. తమ పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 17 నుంచి 31 వరకు పదోతరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయాతేదీల్లో ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6.5 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
పదోతరగతి హాల్‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
Step 1 : పదోతరగతి హాల్‌టికెట్ల కోసం అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి - bse.ap.gov.in
Step 2 : అక్కడ హోంపేజీలో 'AP SSC హాల్‌టికెట్లు'కు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాలి.
Step 3 : అక్కడ వివరాలు నమోదు చేసి, Submit బటన్ మీద క్లిక్ చేాయాలి.
Step 4 : తర్వాతి పేజీలో పదోతరగతి హాల్‌టికెట్‌ను కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
Step 5 : విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింటవుట్ తీసుకోండి.
SSC Public Examinations - 2025 Hall Tickets..
Download S.S.C (Regular) HallTickets
Download S.S.C (Private) HallTickets
Download S.S.C (OSSC) HallTickets
Download S.S.C (OSSC Private) HallTickets
Download S.S.C (Vocational) HallTickets
SSC Public Examinations - 2025 School Wise Hall Tickets
బస్సులో ఉచిత ప్రయాణం..
ఏపీలో పదోతరగతి విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్‌టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపింది. పరీక్షలు రాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో తమ హాల్‌టికెట్లు చూపించి ఇంటి నుంచి పరీక్ష కేంద్రాలకు, ఆ తర్వాత ఇళ్లకు ఉచితంగా వెళ్ళవచ్చని పేర్కొంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఏపీఎస్‌ఆర్‌టీసీ సూచించింది.
టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పూర్తి షెడ్యూల్
- 17-03-2025 (సోమవారం) - ఫస్ట్ ల్యాంగ్వేజ్ గ్రూప్ ఏ - 9.30 నుంచి 12.45 వరకు
- 17-03-2025 (సోమవారం) - ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 1 కాంపోజిట్ కోర్స్ - 9.30 నుంచి 12.45 వరకు
- 19-03-2025 (బుధవారం) - సెకండ్ ల్యాంగ్వేజ్ - 9.30 నుంచి 12.45 వరకు
- 21-03-2025 (శుక్రవారం) - ఇంగ్లీష్ - 9.30 నుంచి 12.45 వరకు
- 22-03-2025 (శనివారం) - ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 2 కాంపోజిట్ కోర్స్ - 9.30 నుంచి 11.15 వరకు
- 22-03-2025 (శనివారం) - OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 1 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) - 9.30 నుంచి 12.45 వరకు
- 24-03-2025 (సోమవారం) - మ్యాథమేటిక్స్ - 9.30 నుంచి 12.45 వరకు
- 26-03-2025 (బుధవారం) - భౌతికశాస్త్రం - 9.30 నుంచి 12.45 వరకు
- 28-03-2025 (శుక్రవారం) - జీవశాస్త్రం - 9.30 నుంచి 12.45 వరకు
- 29-03-2025 (శనివారం) - OSSC మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్ 2 (సంస్కృతం, అరబిక్, పర్షియన్) - 9.30 నుంచి 12.45 వరకు
- 29-03-2025 (శనివారం) - SSC ఒకేషనల్ కోర్స్ (థియరీ)- 9.30 నుంచి 11.30 వరకు
- 31-03-2025 (సోమవారం) - సాంఘీక శాస్త్రం - 9.30 నుంచి 12.45 వరకు





















