అన్వేషించండి

ABP Desam SmartEd Conclave 2026: హైదరాబాద్‌లో ఏబీపీ స్మార్ట్ ఎడ్ కాంక్లేవ్.. విద్యారంగంలో మార్పులు, కెరీర్‌పై నిపుణుల మేధోమథనం!

ఏబీపీ దేశం విద్యా రంగంలో వస్తున్న మార్పులు, మారుతున్న కెరీర్ ప్రాసెస్, సరికొత్త సవాళ్లపై ABP SmartEd Conclave 2026 హైదరాబాద్ వేదికగా ఫిబ్రవరి 24న నిర్వహిస్తోంది.

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలుస్తున్న ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ ఏబీపీ దేశం (ABP Desam) విద్యా రంగంలో వస్తున్న మార్పులు, మారుతున్న కెరీర్ విధానాలపై  చర్చించేందుకు వేదికను సిద్ధం చేసింది. 100 ఏళ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన ఏబీపీ నెట్‌వర్క్‌లో భాగమైన ఏబీపీ దేశం, ప్రతిష్టాత్మకమైన ‘స్మార్ట్ ఎడ్ కాంక్లేవ్ 2026’ (SmartEd Conclave 2026) ను నిర్వహిస్తోంది.

వేదిక, సమయం.. కాంక్లేవ్ ఉద్దేశం
ఈ సదస్సు ఫిబ్రవరి 24, 2026న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల రాడిసన్ బ్లూ (Radisson Blu) హోటల్‌లో జరగనుంది. భారత విద్యా వ్యవస్థలో సాంకేతికత, ఆవిష్కరణలు,  నైపుణ్యాల పాత్రను విశ్లేషించడం ఈ కాంక్లేవ్ ప్రధాన లక్ష్యం. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులను ఎలా తీర్చిదిద్దాలి అనే అంశంపై ఇక్కడ నిపుణులు సమగ్రంగా చర్చించి తమ విలువైన అభిప్రాయాలు షేర్ చేసుకుంటారు. 


ABP Desam SmartEd Conclave 2026: హైదరాబాద్‌లో ఏబీపీ స్మార్ట్ ఎడ్ కాంక్లేవ్.. విద్యారంగంలో మార్పులు, కెరీర్‌పై నిపుణుల మేధోమథనం!

ఏబీపీ స్మార్ట్ ఎడ్ కాంక్లేవ్ సెషన్ టాపిక్స్..

ఉదయం 10:20 గంటలకు చీఫ్ గెస్ట్, ఏబీపీ దేశం బృందం జ్యోతి ప్రజ్వలన చేయడంతో కార్యక్రమం మొదలవుతుంది. అనంతరం తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి 'తెలంగాణ విద్యా రంగ పరివర్తన' అనే అంశంపై తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటారు. ఈ సదస్సులో భాగంగా విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులపై పలు ఆసక్తికర చర్చలు జరగనున్నాయి. 'తరగతి గది నుండి కెరీర్ వరకు - నైపుణ్యాల అంతరాన్ని పూరించడం' అనే అంశంపై ప్రతీక్ శుక్లా (MASAI CEO), రాహుల్ అత్తులూరి (NxtWave CEO) చర్చించనున్నారు.

అలాగే 18 ఏళ్ల యంగ్ ఇన్నోవేటర్ ఆర్యమాన్ మహేశ్వరి తరగతి గదుల ఆధునీకరణపై, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ దేవసేన డిజిటల్ భారత్ కోసం సాంకేతిక విద్యను ఎలా మార్చాలో వివరిస్తారు. ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించేందుకు యంగ్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ అప్పల్ల సాయికిరణ్ 'మనీ మైండ్‌సెట్' గురించి ప్రసంగిస్తారు

మధ్యాహ్న సెషన్లలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావంపై ప్రత్యేక ప్యానెల్ డిస్కషన్ నిర్వహించనున్నారు. ఇందులో డాక్టర్ భరత్ భూషణ్ సింగ్, ప్రొఫెసర్ కోటేశ్వరరావు ఎల్, సయ్యద్ హమీద్ పాల్గొని భవిష్యత్తు విద్యా విధానాలపై చర్చిస్తారు. ఐసిఎఫ్ఎఐ (ICFAI) డైరెక్టర్ సుధాకర్ రావు గ్రాడ్యుయేట్ల ఉపాధి నైపుణ్యాలపై, నటి డాక్టర్ శ్రేయసి సేన్ ప్రతిభను లక్ష్యంగా మార్చుకోవడంపై అవగాహన కల్పిస్తారు. చివరగా గ్లోబల్ ఇండియన్ ఆస్ట్రోనాట్ జాహ్నవి దంగేటి అంతరిక్ష విద్య, స్పేస్ ఎకానమీ గురించి మాట్లాడతారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2:00 గంటలకు విందు భోజనంతో ముగుస్తుంది

ఈ సదస్సులో ప్రముఖ విద్యావేత్తలు, విధాన రూపకర్తలు, అకడమిక్ లీడర్లు, పరిశ్రమ నిపుణులు మరియు ఎడ్-టెక్ (Ed-tech) ఆవిష్కర్తలు పాల్గొననున్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అవసరమైన రోడ్ మ్యాప్‌ను ఈ వేదిక ద్వారా రూపొందించనున్నారు. భారత విద్యా వ్యవస్థను (Education Ecosystem) బలోపేతం చేసే ఈ మేధోమథన కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఏబీపీ దేశం ఆహ్వానిస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget