Etikoppaka Toys: ఏటికొప్పాక బొమ్మలకు బహుమతి- ప్రతి ఆంధ్రుడు గర్వించే సమయం- సంతోషం వ్యక్తం చేసిన చంద్రబాబు, పవన్
Etikoppaka Toys: ఏటికొప్పాక బొమ్మలకు మంచి రోజులు వచ్చాయి. రిపబ్లిక్‌డే పరేడ్‌లో మూడో స్థానం రావడంతో దేశం దృష్టి ఆ బొమ్మలపై పడింది.
![Etikoppaka Toys: ఏటికొప్పాక బొమ్మలకు బహుమతి- ప్రతి ఆంధ్రుడు గర్వించే సమయం- సంతోషం వ్యక్తం చేసిన చంద్రబాబు, పవన్ etikoppaka toys got third place in republic day parade in 2025 chandra babu pawan kalyan Etikoppaka Toys: ఏటికొప్పాక బొమ్మలకు బహుమతి- ప్రతి ఆంధ్రుడు గర్వించే సమయం- సంతోషం వ్యక్తం చేసిన చంద్రబాబు, పవన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/c2ec993d6b420c93852ee27da1bd279c1738155480819215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Etikoppaka Toys Parade: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకత తీసుకొచ్చే కళాకృతుల్లో ఏటికొప్పాక బొమ్మలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు అలాంటి బొమ్మలకు దేశవ్యాప్త గుర్తింపు లభించింది. మూడు రోజుల క్రితం జరిగిన రిపబ్లిక్‌డే వేడుకల్లో పరేడ్ నిర్వహించారు. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక, అభివృద్ది అంశాలతో కూడిన శకటాల పరేడ్ కూడా సాగింది. ఈ పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ ఈసారి ఏటికొప్పాక బొమ్మలతో కూడిన శకటాన్ని ఎంపిక చేసి పంపించింది.
సహజ సుందరమైన చూడముచ్చటగా ఉండే ఏటికొప్పాక శకటం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. అందుకే ఇప్పుడు ఆ శకటం దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానం ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన శకటానికి దక్కితే.. రెండో స్థానం త్రిపుర కైవశం చేసుకుంది. ఈ ఎంపికని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ ఓటింగ్ ద్వారా ఎంపిక చేశారు. ప్రజల నుంచి ఓటింగ్ ప్రకారం శకటాల ఫలితాలను రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడించింది.
ఒక్క శకటాల్లోనే కాకుండా త్రివిధ దళాలు చేపట్టిన కవాతు, కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించిన శకటాలకు కూడా ఓటింగ్ పెట్టారు. మైగవ్ పోర్టల్ ద్వారా ఈ ఓటింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రదర్శించిన ఏటికొప్పాక శకటాన్ని లక్క బొమ్మల ఖ్యాతిని చాటిచెప్పేలా తీర్చిదిద్దారు. అందుకే దేశ ప్రజలకు ఓటింగ్ ద్వారా మూడో స్థానం కట్టబెట్టారు.
Results announced for the best Marching Contingents & Tableaux of the Republic Day Parade 2025
— PIB India (@PIB_India) January 29, 2025
The results for the best Marching Contingents and Tableaux of Republic Day Parade 2025 have been announced. Three panels of judges were constituted to assess the performance of…
రిపబ్లిక్ పరేడ్‌లో ఏటికొప్పాక శకటానికి మూడో స్థానం రావడంపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో 30 ఏళ్ల తర్వాత ఇలా టాప్‌లో ఉన్నామని గుర్తు చేశారు. ఇది సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ శకటం ఏర్పాటులో భాగమైన వారందరినీ చంద్రబాబు అభినందించారు.
ఏటికొప్పాక బొమ్మల శకటానికి మూడో స్థానం రావడం ఆనందంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఈ ప్రక్రియలో భాగమైన వారందర్నీ అభినందించారు. అంతేకాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ ప్రభుత్వం తరపున పవన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏటికొప్పాక బొమ్మలను ప్రోత్సహించే ప్రక్రియ చేపట్టామన్నారు. దీనికి అవసరమైన ముడిసరకు ఇచ్చేందుకు చొరవ తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ బొమ్మల తయారీకి అంకుడు కర్ర అవసరమని అందుకే ఆ చెట్ల పెంపకానికి ప్రోత్సిహిస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రానికి వచ్చిన అతిథులకు ప్రత్యేకంగా ఈ ఏటికొప్పాక జ్ఞాపికలే ఇచ్చేలే చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
A Moment of Pride for Andhra Pradesh. Our Etikoppaka Bommalu - Eco-Friendly Wooden Toys tableau, has earning national recognition by securing third place in the 76th Republic Day parade at Kartavya Path, Delhi. This honor is a testament to our state’s rich artistic, cultural… pic.twitter.com/pLEjVlKRNh
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) January 29, 2025
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)