Pawan Kalyan News: పార్టీ ప్లీనరీ ముందు ఈ స్టేట్మెంట్ అవసరమా జనసేనానీ
Pawan Kalyan News: పార్టీ ప్లీనరీ ముందు ఈ స్టేట్మెంట్ అవసరమా జనసేనానీ? అంటూ కొందరు ఫ్యాన్స్, జనసైనికులు ప్రశ్నిస్తుంటే... ఆయన చర్యలు ఊహాతీతం అంటూ సినిమా డైలాగ్ చెబుతున్నారు మరో వర్గం.

Pawan Kalyan latest News: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేశంతో పాటు ఆలోచన కూడా కలిగి ఉన్న వ్యక్తి అని 2024 ఎన్నికల ఫలితాలతో రుజువైందని జన సైనికులు చెబుతూ ఉంటారు. నిజంగానే ఆల్మోస్ట్ జీరో నుంచి 100% స్ట్రైక్ రేట్‌తో దేశ రాజకీయాల్లో రికార్డు సృష్టించిన వ్యక్తి పవన్. అయితే పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలనుకుంటున్న జన సైనికులు, అభిమానుల కోరిక ప్రస్తుతానికి తీరలేదు. దానికి తగిన కారణాలు ఉన్నాయి కూడా. ఇప్పటికి పోటీ చేసిన 21 సీట్లలో విజయ దుందుభి జనసేనను మరింత విస్తరించే పనిలో పవన్ ఉన్నారు. దానికి మార్చి 14న జరిగే పిఠాపురం ప్లీనరీతో కేడర్‌కు దిశానిర్దేశం ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అయితే సరిగ్గా ప్లీనరీ ముందు వచ్చే 15 ఏళ్లు టిడిపి బీజేపీతో కలిసి అధికారంలో ఉంటామంటూ అసెంబ్లీలో చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చ రేపుతోంది.
Also Read: కూటమి అంటే ఓ కుటుంబం, ఆయన మాటలు మా అందరికీ ఆదర్శం: వైసీపికి పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్
సీఎంగా పవన్ మరో 15 ఏళ్లలో చూడలేమా - జన సైనికుల సందేహం
పవన్ కళ్యాణ్‌ని ఎప్పటికైనా ఏపీ సీఎంగా అనేది జనసైనికుల కోరిక. అయితే ఏపీ అసెంబ్లీలో వైసిపి ప్రవర్తనను విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ జనసేనకు టిడిపికి మధ్య ఎవరు ఎలాంటి విభేదాలు సృష్టించాలని చూసినా అది ఫలించదని చెప్పారు. తమలోతాము ఎన్ని ఇబ్బందులు పడినా మరో 15 ఏళ్లు కలిసి ఉంటామనేది ఆయన స్పీచ్ సారాంశం. దానితో అటు విపక్షాలు షాక్ తింటే ఇటు జనసేన సైనికులు ఆలోచనలో పడ్డారు. బహుశా రానున్న 15 ఏళ్ల పాటు ఇలా పొత్తు కొనసాగుతుంది అంటూ ఏ రాజకీయ పార్టీ నాయకుడు బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వరు. కానీ పవన్ కళ్యాణ్ ఆ సాహసం చేశారు. ఇది ప్రత్యర్ధులకు షాక్ కలిగిస్తే అప్పటి వరకు పవన్ కళ్యాణ్ సీఎం కారా అంటూ పవన్ అభిమానుల్లో చర్చను రేపింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వయసు 53 ఏళ్లు. మరో 15 ఏళ్ళు అంటే 68. అప్పటి వరకూ సీఎం కావాలనే ఆశ పవన్ కళ్యాణ్‌కు లేదా అంటూ అటు ప్రత్యర్థి పార్టీల అభిమానులు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు.
15 ఏళ్లు కలిసి ఉంటాం అన్నారు కానీ.. చంద్రబాబే సీఎం అని అనలేదు కదా!
పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్‌పై మరికొందరు అభిమానులు మరో విధమైన విశ్లేషణ చేస్తున్నారు. మరో 15 ఏళ్లు ఎన్డీఏతో కలిసి ఉంటాం అన్నారు కానీ ఇప్పటివరకు సీఎంగా చంద్రబాబే ఉంటారని పవన్ అనలేదు కదా. రానున్న ఎన్నికల్లో అధిక సీట్లు గెలుచుకుని కూటములోనే సీఎం సీటు జనసేన ఎందుకు దక్కించుకోకూడదని వారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ వ్యూహాలు సామాన్యులకు అర్థం కావని 2024 ఎన్నికల ఫలితాలతోనే అది అందరికీ అర్థమైందని వారు సమర్థిస్తున్నారు. ఏదేమైనా మరో 15 రోజుల్లో పిఠాపురంలో జనసేన పీనరీ జరగబోతుండగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనే రేపింది అని చెప్పాలి.
Also Read:సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు- మీరెవరు అంటూ పోలీసులతో వాగ్వాదం





















