Apsara OTT release: 'అప్సర'తో ఆహా కొత్త ప్రయోగం... ఈ టీజర్ చూశారా ? వర్టికల్ వెబ్ సిరీస్ అంటే ఏంటో తెలుసా?
Apsara OTT release on AHA Tami: మైథలాజికల్ వెబ్ సిరీస్ 'అప్సర'తో ఆహా కొత్త ప్రయోగం చేయబోతోంది. తాజాగా రిలీజ్ అయిన ఈ 'అప్సర' టీజర్ చూశారా?

తెలుగు ఓటీటీ ఆహా తమిళ్ లో కూడా రెగ్యులర్ గా కొత్త షోలు, సినిమాలు, సిరీస్ తీసుకొస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆహా తమిళ ఓటీటీ ఓ సరికొత్త ప్రయోగం చేయడానికి సిద్ధమయ్యింది. ఈ మేరకు ఒక కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించింది. ఇండియాలో మొట్టమొదటి వర్టికల్ వెబ్ సిరీస్ ను తెరపైకి తీసుకురాబోతోంది ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్.
కొత్త సిరీస్ ను ప్రకటించిన ఆహా
ఆహా 'అప్సర' టీజర్ ను తాజాగా విడుదల చేసింది. ఈ టీజర్ ను చూస్తుంటే వెబ్ సిరీస్ ఫాంటసీ థ్రిల్లర్ గా ప్రేక్షకులను అలరించబోతోంది అని అంటున్నారు. అందం, పురాణాలను నిర్వచించే ఓ దేవత, ఆమె తన ప్రేమికుడిని కలవడం గురించి టీజర్లో ఉంది. పైగా ఇదొక యానిమేటెడ్ గ్లింప్స్ కావడం విశేషం. బిగ్ ప్రింట్ పిక్చర్స్ నిర్మించిన ఈ సిరీస్ భారతదేశంలోనే ఫస్ట్ టైమ్ తెరపైకి రాబోతున్న వర్టికల్ వెబ్ సిరీస్. ముఖ్యంగా ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ను అందించబోతోంది.
Also Read:ధనుష్, నాగార్జునల 'కుబేర' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్... అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసిందోచ్
ఈ సిరీస్ గురించి ఆహా తమిళ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కంటెంట్ అండ్ స్ట్రాటజీ హెడ్ కవితా జౌబిన్ మాట్లాడుతూ, "అప్సరతో మేము వర్టికల్ స్క్రీన్ టెక్నాలజీని ఉపయోగించి, ఫ్యూచరిస్టిక్ పద్ధతితో కథ చెప్పబోతున్నాము. ఈ ఫార్మాట్ కేవలం సౌలభ్యం గురించి మాత్రమే కాదు, ఇది మనం కథ చెప్పే విధానాన్ని కూడా మారుస్తుంది. సాంప్రదాయ వైడ్ స్క్రీన్ ఫార్మాట్‌లా కాకుండా, వర్టికల్ ఫ్రేమ్ ప్రేక్షకులు కథలో లీనమయ్యే స్పేస్ ను సృష్టిస్తుంది, ఇక్కడ ప్రేక్షకులు కథకు లోతుగా కనెక్ట్ అయినట్టు భావిస్తారు. మొబైల్ ఎంటర్టైన్మెంట్ ఫాస్ట్ గా అభివృద్ధి చెందుతున్న ఈ యుగంలో, ప్రేక్షకులు మరింతగా నిమగ్నం అయ్యే ఈ ఫార్మాట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సంతోషిస్తున్నాము" అని అన్నారు. 'అప్సర' గురించి ఇతర వివరాలు, విడుదల తేదీ త్వరలో వెల్లడించనున్నారు.
వర్టికల్ వెబ్ సిరీస్ అంటే ఏంటి ?
ప్రముఖ రీజనల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఆహా తమిళ్, తన తాజా క్రియేషన్ తో కొత్త పుంతలు తొక్కడానికి సిద్ధంగా ఉంది. ఫాంటసీ శైలిలో భారతదేశపు మొట్టమొదటి వర్టికల్ వెబ్ సిరీస్ 'అప్సర'ను రూపొందిస్తోంది. వర్టికల్ సిరీస్ అంటే నేటి కాలంలోని స్మార్ట్‌ఫోన్ ప్రేక్షకులకు అనుగుణంగా రూపొందించిన సరికొత్త ఫార్మాట్ లో ఎంటర్టైనమెంట్ ను అందించడం. పైగ్ దీని రన్ టైమ్ తక్కువ వ్యవధి ఉంటుంది.
First look of India's First Vertical OTT series #Apasara
— aha Tamil (@ahatamil) February 26, 2025
Coming soon on namma @ahatamil 🤩🥳✨ pic.twitter.com/Fvzkgszzlx
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

