Weather Latest Update: తగ్గిపోయిన వర్షాలు, అంతా వేడి వాతావరణమే - ఐఎండీ
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
ఈ రోజు అవర్తనం తూర్పు మధ్య బంగాళాఖాతం & పరిసర ప్రాంతాల్లో ఏర్పడి సగటు సముద్ర మట్టం నుండి 4.5 కిమీ నుంచి 7.8 కిమీ మధ్య కొనసాగుతుందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం (ఆగస్టు 29) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ /వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపునకి వీస్తున్నాయని అన్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తూర్పు, ఈశాన్య జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ, వాయువ్య దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.4 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 78 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. కొన్ని చోట్ల బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
ఉత్తరాదిలో తగ్గుతున్న వర్షాలు
వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఢిల్లీ మేఘావృతమై ఉంటుంది. హరియాణా పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం, రాబోయే కొద్ది రోజులు ఢిల్లీ ఎన్‌సీఆర్ చుట్టూ వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు వేడిగాలులతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే, మంగళవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.
ఉత్తరప్రదేశ్‌లో వర్షాకాలం ముగిసింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని ప్రజలు తేమతో కూడిన వేడి వాతావరణం ఉంటోంది. రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో మేఘావృతమై ఉంటుందని అంచనా వేశారు.
మధ్యప్రదేశ్‌లోనూ మరోసారి రుతుపవనాలకు బ్రేక్ పడింది. రాష్ట్రంలోని అనేక నగరాల్లో, నగరాల్లో ఉష్ణోగ్రత రెండు నుండి మూడు డిగ్రీలు పెరిగింది. రాష్ట్రంలో కొత్త వ్యవస్థ యాక్టివ్‌గా మారుతుందని, దీని కారణంగా సెప్టెంబర్ 1-2 నుండి మళ్లీ వర్షాకాలం ప్రారంభం కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా
ఉత్తరాఖండ్‌లో వాతావరణం స్పష్టంగా ఉంటుందని భావిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు ఇంకా ఆగడం లేదు. మంగళవారం కూడా రాష్ట్రంలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. ఇది కాకుండా, హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, కొంకణ్, తమిళనాడు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురుస్తుంది.