అన్వేషించండి

Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్

Praja Palana Vijayostavalu | తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 1 నుంచి 9 రోజులపాటు పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్: డిసెంబర్ 1 నుంచి 9 వరకు తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని, అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో విజయోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.

తొలి ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. ప్రజా పాలన, విజయోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో శనివారం నాడు సమీక్షించారు. నవంబర్ 30వ తేదీన మహబూబ్​నగర్‌లో రైతులకు అవగాహన కల్పించే రీతిలో రైతు సదస్సు (Farmer Summit)కు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.

డిసెంబర్ 1 నుంచి శాఖల వారీగా నిర్దేశించిన మేరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఈ వారం రోజుల్లో జరిగేలా ప్రణాళికను రూపొందించాలన్నారు. తొలి ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ప్రగతి నివేదికతో పాటు భవిష్యత్తు ప్రణాళికను ప్రజల ముందు ఆవిష్కరించాలని సీఎం రేవంత్ సూచించారు.

Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
డిసెంబర్ 4న 9 వేల మందికి నియామకపత్రాలు
డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరపాలని అధికారులకు సూచించారు. ఆ వేదికగా తెలంగాణ గ్రూప్ 4 తో పాటు వివిధ రిక్రూట్‌మెంట్ల ద్వారా ఎంపికైన 9 వేల మందికి నియామక పత్రాలు అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్రమంతటా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి.

మ్యూజిక్ షోలు, ఎయిర్ షోలు
‘డిసెంబర్ 7 నుంచి 9 వరకు మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో సచివాలయ పరిసరాలు, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్ ప్రాంతమంతా తెలంగాణ రాష్ట్ర వైభవం వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించాలి. పరిసరాల్లో ఎగ్జిబిషన్ లాంటి వాతావరణం ఉండేలా పలు రకాల స్టాల్స్ ఏర్పాటు చేయాలి. 3 రోజుల పాటు తెలంగాణ సంస్కృతి, కళారూపాలు ఉట్టి పడే కార్యక్రమాలతో పాటు మ్యూజికల్ షోలు, కన్నుల పండువలా ఉండే డ్రోన్ షో, ఎయిర్ షోలను నిర్వహించాలి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీల్లోనూ ప్రజా పాలన విజయోత్సవ వేడుకలు నిర్వహించాలి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉత్సవ వాతావరణం కనిపించాలని’ సీఎం రేవంత్ రెడ్డి అధికారులు, మంత్రులకు సూచించారు.

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
డిసెంబర్ 9 న సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని, ఈ వేడుకలకు తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, విద్యావంతులను, వివిధ రంగాల్లో ప్రతిభ సాధించిన వారందరినీ ఆహ్వానించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి నియోజకవర్గం నుంచి 1000 మంది చొప్పున మహిళా శక్తి ప్రతినిధులతో లక్ష మంది తెలంగాణ మహిళల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ నగరంలో జరిగే ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కే కేశవరావు, శ్రీనివాసరాజు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Also Read: Revanth Reddy: కొడంగల్ లో ఫార్మా సిటీ ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget