అన్వేషించండి

PNB Jobs: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, ఎంపిక ఇలా

పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. దీనిద్వారా మొత్తం 350 ఖాళీలను భర్తీచేయనుంది. ఈ పోస్టుల భర్తీకి మార్చి 3 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.

PNB SO Recruitment: న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్(Punjab National Bank), మానవ వనరుల విభాగం దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 350 ఖాళీలను భర్తీచేయనున్నారు. సంబంధిత విభాగంలో బీటెక్‌, బీఈ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, పీజీ డిప్లొమా, సీఎ, ఐసీడబ్ల్యూ, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మార్చి 3 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మార్చి 24 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 350

పోస్టుల కేటాయింపు: యూఆర్- 152, ఈడబ్ల్యూఎస్- 32, ఓబీసీ- 91, ఎస్సీ- 25, ఎస్టీ- 50.

➥ ఆఫీసర్-క్రెడిట్ (జేఎంజీ స్కేల్-I): 250 పోస్టులు

➥ ఆఫీసర్-ఇండస్ట్రీ (జేఎంజీ స్కేల్-I): 75 పోస్టులు

➥ మేనేజర్-ఐటీ (ఎంఎంజీ స్కేల్-II): 05 పోస్టులు

➥ సీనియర్ మేనేజర్-ఐటీ (ఎంఎంజీ స్కేల్-III): 05 పోస్టులు

➥ మేనేజర్-డేటా సైంటిస్ట్(ఎంఎంజీ స్కేల్-II): 03 పోస్టులు

➥ సీనియర్ మేనేజర్-డేటా సైంటిస్ట్(ఎంఎంజీ స్కేల్-III): 02 పోస్టులు

➥ మేనేజర్-సైబర్ సెక్యూరిటీ (ఎంఎంజీ స్కేల్-II): 05 పోస్టులు

➥ సీనియర్ మేనేజర్ సైబర్ సెక్యూరిటీ (ఎంఎంజీ స్కేల్-III): 05 పోస్టులు 

అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్‌, బీఈ, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ, పీజీ డిప్లొమా, సీఎ, ఐసీడబ్ల్యూ, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 21 - 38 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీ అబ్యర్థులకు 03 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, మాజీ సైనికోద్యోగులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.50.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

రాత పరీక్ష విధానం: పరీక్షకు 120 నిమిషాల వ్యవధి ఉంటుంది. 50 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పార్ట్ I, పార్ట్ II భాగాలు ఉంటాయి. పార్ట్ Iలో రీజనింగ్ (25-ప్రశ్నలు, 25-మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (25-ప్రశ్నలు, 25-మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (50- ప్రశ్నలు, 50- మార్కులు) ఉంటాయి. పార్ట్ IIలో ప్రొఫెషనల్ నాలెడ్జ్ (50- ప్రశ్నలు, 100- మార్కులు) ఉంటాయి. 

జీతం: నెలకు క్రెడిట్‌ ఆఫీసర్‌, ఇండస్ట్రీ ఆఫీసర్‌కు రూ.48,480 - రూ.85,920, మేనేజర్‌ (ఐటీ), మేనేజర్‌ డేటా సైంటిస్ట్‌, మేనేజర్‌ సైబర్ సెక్యూరిటీకు రూ.64,820 - 93,960, సీనియర్ మేనేజర్‌(ఐటీ), సీనియర్ మేనేజర్‌(డేటా సైంటిస్ట్‌), సీనియర్‌ మేనేజర్‌ సైబర్‌ సెక్యూరిటీకు రూ.85,920 - 1,05,280.

పరీక్ష కేంద్రాలు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, అస్సాం, బిహార్‌, ఛత్తీస్‌గఢ్, దిల్లీ, గుజరాత్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌, ఝార్ఖండ్‌, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, మణిపుర్‌, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, త్రిపుర, ఉత్తర్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమ్ బెంగాల్‌.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ/ గుంటూరు, వైజాగ్.

ముఖ్యమైన తేదీలు..

✦ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.03.2025.

✦ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24.03.2025.

✦ రాత పరీక్ష తేదీలు: మార్చి/మే 2025.

Notification

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Embed widget