Sajjala Ramakrishna Reddy: బెయిల్ కావాలంటూ ఏపీ హైకోర్టులో సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి పిటీషన్
Sajjala seek anticipatory bail in Posani case | బెయిల్ కావాలంటూ ఏపీ హైకోర్టులో సజ్జల రామకృష్ణారెడ్డి, భార్గవ్ రెడ్డి పిడిషన్

వస్తున్న లీకులను బట్టి పోసాని కృష్ణ మురళి వైసిపి కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డిని గట్టిగానే ఇరికించేసినట్టు కనపడుతోంది. తను మాట్లాడిన మాటలు, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై ఉపయోగించిన భాష అంతా ఒక స్క్రిప్ట్ ప్రకారం నడిచింది అంటూ పోసాని (Posani Krishna Murali) పోలీసులు ముందు ఒప్పుకున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో రేపో మాపో తమ అరెస్టు తప్పదని సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి భావించి కోర్టును ఆశ్రయించారు. తమకు ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాలంటూ వారు కోరారు
పోసాని అరెస్ట్ తో అలెర్ట్ అయిన సజ్జల
ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్ళిన ఆరుగురు పోలీసుల టీం పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాకు కు తరలించారు. 9 గంటల విచారణ తర్వాత ఆయనను రైల్వే కోడూరు కోర్టులో హాజరు పరిచారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో పోసాని కృష్ణ మురళిని రాజంపేట సబ్ జైలు కు తరలించారు. వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై ప్రెస్ మీట్ లు పెట్టి రాయలేని భాషలో దుర్భాషలాడారు పోసాని. కూటమి అధికారం లోకి రాగానే తాను ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించి సైలెంట్ అయిపోయారు పోసాని. అయితే గతంలో ఆయన వాడిన భాష తమ మనోభావాలు దెబ్బతీసాయి అంటూ కంప్లైంట్స్ రావడం తో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అయితే సజ్జల చెబితేనే తాను అలా తిట్టాను అంటూ పోసాని పోలీసులు ముందు ఒప్పుకున్నారని ప్రచారం సాగుతోంది. దానితో ఇక తన అరెస్టు తప్పదని భావించిన సజ్జల రామకృష్ణారెడ్డి,ఆయన కుమారుడు భార్గవ్ రెడ్డి కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేశారు.
Also Read: Posani Heart Problem: పోసాని కృష్ణమురళి ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు నిర్వహించిన భార్గవ్ రెడ్డి
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలను సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి నిర్వహించారు. అప్పటి సోషల్ మీడియా యాక్టివిస్టులు, అందరు ఫ్రీ లాన్స్ జర్నలిస్టులు, వైసీపీకి అనుకూలంగా పనిచేసిన యూట్యూబర్లు భార్గవ్ రెడ్డి కనుసన్నల్లోనే పనిచేసేవారని అప్పటి ప్రతిపక్షమైన టిడిపి జనసేన పార్టీల నేతలు కార్యకర్తలపై సోషల్ మీడియాలో చెప్పలేని భాషతో విరుచుకుపడింది భార్గవ్ రెడ్డి సూచనలతోనే అని టిడిపి జనసేన నాయకులు ఆరోపిస్తూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ వాటిని దృష్టిలో పెట్టుకుని తమను అరెస్టు చేసే దిశగా నడుస్తున్నాయని భావించిన భార్గవ్ రెడ్డి ,అయన తండ్రి సజ్జల ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు వార్తలు షికారు చేస్తున్నాయి.
Also Read: PV Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ





















