R Madhavan: యువతులకు మెసేజెస్ అంటూ ప్రచారం - నటుడు మాధవన్ క్లారిటీ, అసలు ఏం జరిగిందో తెలుసా?
R Madhavan Clarity On Rumours: తనపై వస్తోన్న రూమర్లపై నటుడు ఆర్.మాధవన్ స్పందించారు. తాను యువతులకు మాత్రమే సందేశాలు పంపుతానంటూ వస్తోన్న ప్రచారం అవాస్తవమని.. ఆ ఆరోపణలు ఎందుకొచ్చాయో క్లారిటీ ఇచ్చారు.

R Madhavan Clarity On Rumours That He Chats With Young Girls On Instagram: ప్రముఖ నటుడు ఆర్.మాధవన్ (R Madhavan) తనపై వస్తోన్న రూమర్లపై స్పందించారు. ఆయన ఆన్ లైన్ వేదికగా యువతులకు మాత్రమే సందేశాలు పంపుతారంటూ ఎన్నో రోజుల నుంచి ప్రచారం సాగుతోంది. అమ్మాయిలను ఆకర్షించేలా ఆయన సందేశాలు పంపిస్తారని చాలా మంది కామెంట్స్ చేస్తుండగా.. దీనిపై రీసెంట్‌గా మాధవన్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. అవన్నీ పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. తనపై అలాంటి ఆరోపణలు రావడానికి గల కారణాలను సైతం వెల్లడించారు. 'నేను ఆన్ లైన్ తక్కువగా వాడుతాను. ఫ్యాన్స్ చేసిన మెసేజెస్‌కు కూడా అంత వేగంగా రిప్లై ఇవ్వను. కొంతకాలం క్రితం ఇన్‌స్టాలో నాకు ఓ అమ్మాయి మెసేజ్ చేసింది. నేను నటించిన ఓ సినిమా గురించి వివరిస్తూ ఆమె మెసేజ్ పంపింది.
'సర్ మీరంటే నాకెంతో ఇష్టం. మీరు నటించిన ఆ మూవీ చూశాను. ఇది నాకెంతో నచ్చింది. మీరు అద్భుతమైన నటుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో మీ నటన సూపర్. మీరు నాలో ఎంతో స్ఫూర్తి నింపారు.' అని పేర్కొంటూ ముద్దులు, హార్ట్ ఎమోజీలు జత చేసింది. సదరు అభిమాని అంతలా అభిమానం చూపిస్తుంటే స్పందించకపోతే బాగోదు అని నేను కూడా 'థ్యాంక్యూ సో మచ్.. గాడ్ బ్లస్ యు' అని రిప్లై ఇచ్చాను. ఆ యువతి.. ఆ పోస్టులో సగం (ముద్దు, హార్ట్ ఎమోజీస్), నా పోస్ట్ కలిపి స్క్రీన్ షాట్ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. మాధవన్ నాకు మెసేజ్ పంపారని రాసుకొచ్చింది. ఇది చూసిన చాలామంది నేను ఆమెకు ముద్దులు, హార్ట్ ఎమోజీలు పంపానని అనుకున్నారు. యువతులను మభ్యపెట్టేలా సందేశాలు పంపుతానని మాట్లాడుకున్నారు. కానీ నిజానికి జరిగింది ఇది. ఆ ఘటన తర్వాత సోషల్ మీడియా వాడకం విషయంలో చాలా జాగ్రత్తగా.. ఎంతో క్లారిటీతో ఉంటున్నా.' అంటూ మాధవన్ తనపై వచ్చిన రూమర్లపై క్లారిటీ ఇచ్చారు.
Also Read: ఏపీ మహిళా సాధికారిత అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరి - ఆ ప్రచారంలో నిజమెంత?, అలాంటి వారికి వార్నింగ్
నటుడు మాధవన్ మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించి టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు పొందారు. అనంతరం 2000లో మణిరత్నం దర్శకత్వం వహించిన 'అలైపాయుతే' సినిమాతో తమిళంలో స్టార్ హీరోగా మారారు. ఆ తర్వాత తమిళం, హిందీ, పలు తెలుగు సినిమాల్లోనూ నటించి మెప్పించారు. సఖి, చెలి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఆయన ఇటీవలే ప్రఖ్యాత ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్ర 'రాకెట్రీ' మంచి విజయాన్ని అందుకుంది. ఇటీవలే జీ5లో వచ్చిన 'హిసన్ బరాబర్' మూవీలో ప్రధాన పాత్ర పోషించారు.





















