Shivangi Trailer: సత్యభామతో సవాల్ చేస్తే చావే - 'శివంగి'గా ఆనంది పవర్ ఫుల్ యాక్షన్ అదుర్స్, థ్రిల్లింగ్ ట్రైలర్ చూశారా?
Shivangi Trailer Released: నటి ఆనంది పవర్ ఫుల్ రోల్‌లో వస్తోన్న లేటెస్ట్ మూవీ 'శివంగి'. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. మార్చి 7న ఈ సినిమా విడుదల కానుంది.

Anandhi and Varalaxmi Sarath Kumar's Shivangi Movie Update: ప్రముఖ నటి ఆనంది (Anandhi), వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ క్రైమ్ హారర్ థ్రిల్లర్ మూవీ 'శివంగి' (Shivangi). దేవ్‌రాజ్ భరణి ధరణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై పి.నరేష్‌బాబు నిర్మించారు. పవర్ ఫుల్ వుమెన్ సెంట్రిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో తమిళ నటుడు జాన్ విజయ్, డాక్టర్ కోయకిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఆనంది ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మార్చి 7న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుండగా.. తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
'అందరి జీవితంలో గుడ్ డే, బ్యాడ్ డే అని ఒక రోజు ఉంటుంది. కానీ నా జీవితంలో రెండూ ఒకే రోజు జరిగాయి' అంటూ ఆనంది చెప్పిన డైలాగ్‌తో ఓపెన్ అయిన ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్‌గా సాగింది. వరలక్ష్మి శరత్‌కుమార్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా.. ఆనందిని విచారించిన తీరు ఆకట్టుకుంటోంది. ఇక సత్యభామ రోల్‌లో ఆనంది ఒదిగిపోయారు. ఆమె చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ హైప్‌ను పెంచేశాయి. 'సత్యభామరా .. సవాల్ చేయకు చంపేస్తా' అనే డైలాగ్ అదిరిపోయింది.
Also Read: 'స్టోరీ చెప్పండి.. బైక్ తీసుకెళ్లండి' - హీరో కిరణ్ అబ్బవరం బంపరాఫర్, మీరూ ట్రై చేయండి!
క్రైమ్ థ్రిల్లర్.. డిఫరెంట్ స్టోరీ
'శివంగి'గా ఆనంది జీవితంలో జరిగిన విషయాలను చాలా సస్పెన్స్ ఫుల్‌గా తెరకెక్కించినట్లు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. ఇప్పటికే ఆనంది ఫస్ట్ లుక్ టీజర్ మూవీపై హైప్‌ను భారీగా పెంచేయగా.. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ మరింత హైప్ క్రియేట్ చేసింది. నల్లలుంగీ, చొక్కాతో కాళ్లపై కాళ్లు వేసుకుని కళ్లద్దాలు ధరించి నుదిటిపై విభూతితో ఆనంది లుక్ ఆకట్టుకోగా.. వంగే వాళ్లు ఉన్నంత వరకూ.. మింగే వాళ్లు ఉంటారు. కానీ నేను వంగే రకం కాదు.. మింగే రకం.', 'సత్యభామ అంటే చందమామ కథలు చెప్పే బామ్మ కాదు.. ఇక్కడ బ్యూటీ నేనే.. బీస్ట్ కూడా నేనే' అంటూ టీజర్‌లో ఆనంది డైలాగ్స్ అదుర్స్ అనిపించాయి. ఓ సాధారణ గృహిణి జీవితంలో జరిగిన సంఘటనలు, లవ్, భార్యాభర్తల మధ్య వచ్చే రెగ్యులర్ సమస్యలు, అత్తా కోడళ్ల మధ్య తగాదాలు వంటి వాటిని డిఫరెంట్‌గా చూపిస్తున్నట్లు టీజర్, ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. సదరు గృహిణి ఆ సమస్యలు ఎలా ఎదుర్కొంది.? పోలీస్ ఆఫీసర్ వరలక్ష్మి ఎందుకు ఎంటర్ కావాల్సి వచ్చింది అనే విషయాలు తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ వేచి చూడాల్సిందే.
వరంగల్ జిల్లాకు చెందిన ఆనంది.. 'బస్ స్టాప్' మూవీ ద్వారా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. తన అందం, అభినయం, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘జాంబిరెడ్డి’, ‘శ్రీదేవి సోడా సెంటర్’, ‘ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం’ లాంటి సినిమాల్లో నటించి మెప్పించారు. అనంతరం టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చారు. కయల్ మూవీతో కోలీవుడ్‌లోకి ఆమె ఎంట్రీ ఇవ్వగా ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమె పేరు కయల్ ఆనందిగా మారింది. తమిళంలో ఇప్పటివరకూ 20కి పైగా సినిమాలు చేశారు. ఆనంది చివరిసారిగా తెలుగులో నాగచైతన్య నటించిన 'కస్టడీ'లో కనిపించారు.
Also Read: హారర్ థ్రిల్లర్ క్రైమ్ మూవీస్‌తో పాటు సిరీస్‌లు - 'జియో హాట్ స్టార్'లో మార్చిలో రాబోయే చిత్రాలివే!





















