అన్వేషించండి
Jiohotstar Upcoming Movies: హారర్ థ్రిల్లర్ క్రైమ్ మూవీస్‌తో పాటు సిరీస్‌లు - 'జియో హాట్ స్టార్'లో మార్చిలో రాబోయే చిత్రాలివే!
Jiohotstar New Releases: ఈ సమ్మర్‌లో అలరించేందుకు పలు క్రైమ్ డ్రామా కామెడీ థ్రిల్లర్ మూవీస్, సిరీస్‌లతో సిద్ధమవుతోంది జియోహాట్‌స్టార్. ఈ మేరకు మార్చిలో రిలీజ్ చేసే వాటి జాబితాను రిలీజ్ చేసింది.

మార్చిలో హాట్ స్టార్‌లో చిత్రాల లిస్ట్
Source : Twitter (X)
Jiohotstar March 2025 Movie Releases Web Series Check List: ఈ సమ్మర్‌కు ఆస్కార్ ఈవెంట్స్, క్రైమ్, థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్‌లతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు 'జియో హాట్‌స్టార్' ఓటీటీ ప్లాట్ ఫాం సిద్ధమవుతోంది. ఇప్పటికే క్రికెట్ అభిమానులను అలరించే ఛాంపియన్స్ ట్రోఫీ స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా, మార్చిలో రాబోయే మూవీస్, వెబ్ సిరీస్‌ల జాబితాను రిలీజ్ చేసింది. వాటిని ఓసారి చూస్తే..
మూవీస్ అండ్ వెబ్ సిరీస్..
- 'JOKER: FOLIE A DEUX' - టాడ్ ఫిలిప్స్ దర్శకత్వం వహించిన ఈ సైకలాజికల్ డ్రామా మూవీ 2019లో వచ్చిన జోకర్ సినిమాకు సీక్వెల్. ఈ సినిమా ఆదివారం నుంచి జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
- అలాగే 97వ ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతోంది. ఈ ఈవెంట్ మార్చి 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
- 'DARE DEVIL: BORN AGAIN' - ఈ సిరీస్ మార్చి 5 నుంచి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇది యాక్షన్ సిరీస్ కాగా.. చార్లీ కాక్‌స్ మళ్లీ డేర్ డెవిల్‌గా నటిస్తున్నారు. ఇది పూర్తిగా కొత్త సిరీస్.
- DELI BOYS: ఈ అమెరికన్ కామెడీ సిరీస్ మార్చి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
- THUGESH VS THE WORLD - ప్రముఖ భారతీయ యూట్యూబర్ మహేష్ కేశ్వాల్ ఆధ్వర్యంలో వస్తోన్న కామెడీ షో. ఈ నెల 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
- THE RIGHTEOUS GEMSTONES - ఈ ప్రసిద్ధ కామెడీ సిరీస్ ఇప్పటికే 3 సీజన్లను పూర్తి చేసుకుంది. లేటెస్ట్ సీజన్ మార్చి 10 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
- TOP CHEF - ఈ పాపులర్ అమెరికన్ రియాలిటీ కుకింగ్ షో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
- MOANA 2: 2016లో వచ్చిన యానిమేటెడ్ మూవీకి సీక్వెల్‌గా వస్తోన్న ఈ హిట్ సినిమా మార్చి 14 నుంచి అందుబాటులోకి రానుంది.
- ANORA - సీన్ బేకర్ (Sean Baker) తెరకెక్కించిన అమెరికన్ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
- GOOD AMERICAN FAMILY - ఈ నెల 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
- GANGS OF LONDON - ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అదే రోజు నుంచి 'HAPPY FACE' కూడా అందుబాటులోకి రానుంది.
Also Read: హాట్ సమ్మర్.. కూల్ మూవీస్ - మార్చిలో రిలీజ్ అయ్యే చిత్రాలివే!, ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చెయ్యండి!
- KANNEDA - పర్మీష్ వర్మ (Parmish verma), రణ్‌వీర్ షోరే, అరుణోదయ్ సింగ్, జీషాన్ ఆయుబ్, జాస్మిన్ బజ్వా తదితరులు కీలకపాత్రలు పోషించిన క్రైమ్ థ్రిలర్ సిరీస్ 'కన్నెడా'. ఈ సిరీస్‌కు చందన్ అరోరా దర్శకత్వం వహించగా.. ఓ పంజాబీ యువకుడు కెనడా వెళ్లి.. అక్కడ వివక్షను ఎదిరించి ఎలా డాన్‌గా ఎదిగాడనే కథాంశంతో సిరీస్ ఉంటుందని తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
- WICKED: ఈ మ్యూజిక్ ఎంటర్‌టైనర్ ఈ నెల 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
- IPL - క్రికెట్ అభిమానుల కోసం ఈ నెల 22 నుంచి ఐపీఎల్ స్ట్రీమింగ్ కానుంది.
- SUITS LA - ఈ లీగల్ డ్రామా సిరీస్ ప్రతీ సోమవారం కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. అలాగే, 'THE WEIGHT LOSS' కొత్త ఎపిసోడ్ ప్రతీ సోమవారం అందుబాటులోకి రానుంది. మరోవైపు, 'OM KALI JAI KALI' సైతం త్వరలో స్ట్రీమింగ్ కానుంది.
ఇంకా చదవండి






















