హీరో మాధవన్ ఎలాంటి వర్కౌట్, డైట్ ప్లాన్స్ ఫాలో అవుతారో తెలుసా? మాధవన్ ఫిట్ నెస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. పక్కా డైట్ ఫాలో అవుతారు. రోజూ 30 నిమిషాల పాటు కార్డియో ఎక్సర్ సైజ్ చేస్తారు. ఇందుకోసం రన్నింగ్, సైక్లింగ్, ఎలిప్టికల్ మెషీన్‌ని ఉపయోగిస్తారు. ఆ తర్వాత స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్స్, బెంచ్ ప్రెస్ తో పాటు పుల్ అప్స్ చేస్తారు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు కచ్చితంగా యోగా చేస్తారు. మాధవన్ రోజూ సమతుల్య ఆహారాన్ని తీసుకుంటారు. ప్రోటీన్స్ కోసం చికెన్, చేపలు, గుడ్లు, చిరు ధాన్యాలు తీసుకుంటారు. కార్బోహైడ్రేట్ల కోసం బ్రౌన్ రైస్, క్వినోవా, చిలగడదుంపలు తింటారు. విటమిన్స్, మినరల్స్ కోసం పండ్లు, కూరగాయలు తీసుకుంటారు. All Photos Credit: Ranganathan Madhavan/twitter