పచ్చి ఉల్లిపాయ తింటే ఈ సమస్యలు రావచ్చు



బిర్యానీ తో పాటు పక్కన ఉల్లిపాయలు ఉండాల్సిందే. బిర్యానీ తింటూ మధ్యలో పచ్చి ఉల్లిపాయను తింటేనే కొంతమందికి మజా వస్తుంది.



నిజానికి పచ్చి ఉల్లిపాయను తినడం అంత మంచిది కాదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.



పచ్చి ఉల్లిపాయను అధికంగా తింటే మాత్రం కొన్ని అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది.



పచ్చి ఉల్లిపాయలు కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉండే అవకాశం ఉంది.



పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల సాల్మొనల్లా బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థలో చేరుతుంది. అక్కడ పేగులపై ప్రభావం చూపిస్తుంది.



దీని వల్ల పొట్ట నొప్పి, వికారం వంటివి వస్తాయి. ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది.



పచ్చి ఉల్లిపాయను అధికంగా తింటే కడుపులో నొప్పి రావచ్చు. కాబట్టి ఎక్కువగా తినకపోవడమే ఉత్తమం.



పచ్చి ఉల్లిపాయ వల్ల నోటి దుర్వాసన సమస్య పెరుగుతుంది. అలాగే ఎసిడిటీ కూడా వస్తుంది.