అందంగా ఉంటే కెరీర్ దూసుకెళ్తుందట



అందంగా ఉన్న అబ్బాయి, అమ్మాయిలు ఇతరులతో పోలిస్తే కెరియర్లో చాలా వేగంగా దూసుకెళ్లే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతోంది ఈ అధ్యయనం.



సాధారణంగా ఉండే అబ్బాయిలతో పోలిస్తే అందంగా ఉండే అబ్బాయిలు 20 శాతం అధికంగా ఎక్కువ సంపాదించే అవకాశం ఉందని ఈ అధ్యయనం తేల్చింది.



ముఖం అందంగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నారని ఎదుటివారికి సులువుగా అర్థం అవుతుందని, అందుకే వారికి అవకాశాలు ఎక్కువగా వస్తాయని కూడా అధ్యయనం ఉంటుంది.



ఇంటర్వ్యూలలో మంచి స్కోర్ సాధించడంతో పాటు, అందంగా కూడా ఉంటే అది వారికి కచ్చితంగా ప్లస్ పాయింట్ అని నిర్ధారించింది అధ్యయనం.



అందం అనేది ప్రతి ఉద్యోగంలోనూ కనీస పాత్రను పోషిస్తుందని, ఉద్యోగాలు తెచ్చిపెట్టడంలో సాయపడుతోందని కూడా అధ్యయనం చెబుతోంది.



అయితే అందం ఒక్కటే కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లలేదని, తెలివితేటలు, చదువు, టాలెంట్ కూడా ఉండాలని... అవన్నీ ఉంటేనే అందం ప్లస్ పాయింట్‌గా మారుతుందని వివరిస్తోంది.



అందంతో పాటూ ఆత్మవిశ్వాసం కూడా చాలా ముఖ్యం.



మాటల్లో ఆత్మ విశ్వాసం కనిపిస్తూ ఉంటే అది కూడా వారి కెరీర్‌కు ఎంతో మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.