బార్బీ లాంటి అందం కావాలా? అయితే అందుకోసం మొహానికి రంగులు వేసుకోవాల్సిన అవసరం లేదు.



ప్రకాశవంతమైన చర్మం కావాలంటే ఈ ఆహార పదార్థాలు మీ డైట్లో తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి.



బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, కాన్ బెర్రీస్ లో పోషకాలు అధికంగా ఉంటాయి.
చర్మానికి అద్భుతమైన మెరుపుని అందిస్తాయి.


కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్ గా గుడ్డు క్రీమ్ ప్రసిద్ధి చెందింది.
గుడ్డు సొనలు ముఖంపై మెరుపుని ఇచ్చేందుకు పని చేస్తాయి.


దద్దుర్లు, మొటిమలతో పాటు అనేక చర్మ సమస్యలకు చికిత్స చేసే గుణాలు క్యారెట్ లో మెండుగా ఉన్నాయి.



టొమాటో రసంలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ గుణాలు కలిగి ఉన్నాయి.
చర్మం మీద వచ్చే నూనె ఉత్పత్తిని తగ్గిస్తాయి.


మెరిసే చర్మం పొందాలని అనుకుంటే మామిడి పండ్లు మితంగా తీసుకోవాలి.
ఇవి సహజ సన్ స్క్రీన్ గా పని చేస్తాయి.


కొబ్బరి నీళ్ళు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి.
వృద్ధాప్య సంకేతాలు దూరం చేస్తుంది.


Images Credit: Pexels/ Pixabay