బెల్లం టీ తాగితే బరువు తగ్గవచ్చు. అంతే కాదు ఇదొక సహజ స్వీటెనర్.



ఈ టీ తాగితే జీర్ణక్రియకి సహాయపడుతుంది. రక్తహీనత నుంచి బయట పడేస్తుంది.
ఎలా తయారు చేసుకోవాలంటే..


కావాల్సిన పదార్థాలు
2 కప్పుల నీరు, 3 టేబుల్ స్పూన్ల బెల్లం, 1 టీస్పూన్ టీ ఆకులు, యాలకులు
అంగుళం తురిమిన అల్లం, దాల్చిన చెక్క ముక్క చిన్నది, చిటికెడు ఎండు మిర్చి


ఒక గిన్నెలో నీరు తీసుకుని అల్లం, యాలకులు, దాల్చిన చెక్క, టీ పొడి వేసి బాగా మరిగించాలి.



టీ మరిగిన తర్వాత అందులో కాస్త నల్ల మిరియాల పొడి కలుపుకోవాలి.



ఇవి ఉడికిన తర్వాత కాస్త టీ పొడి, రుచికి సరిపడా బెల్లం వేసుకోవాలి.



కొద్ది సేపు మరిగించుకున్న తర్వాత వడకట్టుకుని కప్పులో టీ పోసుకోవడమే.



సింపుల్ ఎంతో టేస్టీగా ఉండే బెల్లం టీ రెడీ అయిపోతుంది.



ఈ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. జీవక్రియని ప్రోత్సహిస్తుంది.
Images Credit: Pexels