కొబ్బరి నీళ్లతోనూ సైడ్ ఎఫెక్ట్స్!



రుచిగా ఉండే కొబ్బరి నీళ్లు దాహం తీర్చడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అలసట, నీరసం తగ్గించే రిఫ్రెష్ డ్రింక్ ఇది



కొబ్బరి నీళ్లలో కార్బొహైడ్రేడ్లతో పాటు మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం లాంటి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా లభిస్తాయి.



అయితే కొబ్బరి నీరు అతిగా తాగితే లో బ్లడ్ షుగర్ వంటి సమస్యలు రావచ్చు, ఎలక్ట్రోలైట్ సమతుల్యత కూడా దెబ్బతింటుంది. దీనివల్ల శరీర కణాల పనితీరు ప్రభావితం అవుతుంది.



కొబ్బరి నీరు ఎక్కువగా తాగితే పొట్ట ఉబ్బరం వంటి అజీర్తి సమస్యలు కూడా తలెత్తవచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా కొబ్బరి నీళ్లు తాగకూడదు.



అలర్జీ ఉన్నవారు కొబ్బరి నీళ్లు అతిగా తాగితే దురద, దద్దుర్లు, వాపు వంటి అలర్జిక్ ప్రాబ్లమ్స్ బారిన పడే అవకాశం ఉంది.



రక్తపోటు సమస్యలు ఉన్నవారు, కొబ్బరి నీళ్ళు తీసుకునే ముందు డాక్టర్‌ను కలవడం చాలా ముఖ్యం.



కొబ్బరి నీళ్లలో చాలా కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నవారికి ఇది సమస్యగా మారుతుంది. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటే కొబ్బరి నీళ్లు చాలా మితంగా తాగాలి.



ఏదైనా శస్త్రచికిత్స జరిగిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగడం సరికాదు. ఇది రక్తపోటును నియంత్రించడంలో సమస్యలు కలిగిస్తుంది.



కొబ్బరి నీళ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరానికి మేలు చేస్తుంది కానీ అతిగా తాగితే మాత్రం హైపర్‌కలేమియా అనే అనారోగ్య సమస్య రావచ్చు.



ఎప్పుడో ఒకసారి కొబ్బరి నీళ్లను తీసుకోవడం వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు.
Images Credit: Pixabay