మనం తీసుకునే ఆహారంలో అదనంగా తీసుకునే ప్రతి చిటికెడు ఉప్పు మన కార్డియో వాస్క్యూలార్ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.

ఉప్పు ఎక్కువగా తింటే బీపీ పెరుగుతుంది. ఇది రక్తనాళాలను ప్రత్యక్షంగానే పాడు చేస్తుంది.

రక్తనాళాలు క్రమంగా కుంచించుకుపోవడం వల్ల రక్తప్రసరణకు ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

కొంత కాలానికి గుండె కండరం బిగుసుకుపోవడానికి, గుండె పరిమాణం పెరగడానికి కారణం అవుతుంది.

ఉప్పు తగ్గించి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

ప్యాక్డ్ ఫూడ్ తినేసమయంలో దాని మీదున్నలేబుల్స్ కచ్చితంగా చదవాలి.

తక్కువ సోడియం ఉన్న పదార్థాలు మాత్రమే తినాలి.

ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రుచికోసం ఉప్పుకు ప్రత్యామ్నాయంగా ఇతర మూలికలు, మసాలాలు, ఇతర సీసనింగ్స్ వినియోగించాలి.

వీలైనంత వరకు అన్ ప్రాసెస్డ్ తాజా ఆహారాన్ని తీసుకోవడం మంచిది.

కెట్చప్స్, సలాడ్ డ్రెస్సింగ్స్ , సాస్ ల వంటి కాండ్డిమెంట్స్ లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇవి తీసుకోకపోవడమే మంచిది.

స్నాక్ మంచెస్ కి దూరంగా ఉండాలి. వీటికి బదులు గింజలు, పండ్లు, ఎయిర్ పాప్డ్ పాప్ కార్న్ వంటివి మంచి ఆప్షన్స్.

తగినన్ని నీళ్లు తాగితే ఎక్కువైన సోడియం ఎప్పటికప్పుడు శరీరం నుంచి బయటికి విసర్జితమవుతుంది.

క్రమంగా ఉప్పు వినియోగం తగ్గిస్తూ అలవాటు చేసుకోవడం అవసరం.
Representational image:Pexels