ఎముకలు బలహీన పడడం, ఆస్టయోపోరోసిస్ అనేది నడివయసు దాటిన తర్వాత సాధారణం. దీన్ని గుర్తించడం చాలా అవసరం గోళ్లు సులభంగా విరిగిపోతుంటే శరీరంలో కాల్షియం వంటి ఖనిజాలు, కొల్లాజెన్ తగ్గిపోతున్నాయని అనేందుకు సూచికలు. కాస్త బరువైన పనులు చేసినా ఎముకలు ఫ్రాక్చరవుతుంటాయి. ఇది అతిముఖ్యమైన లక్షణం శరీర భంగిమల్లో మార్పు రావడం, నిలబడినపుడు నిటారుగా నిలబడకుండా కొద్దిగా ముందుకు వంగినట్టు ఉండడం ఇది వెన్నెముక బలహీనపడుతోందని చేప్పేందుకు సంకేతం చేతుల్లో పట్టు సడలిపోవడం. చేతి పట్టు బలంగా ఉండడం ముంజేతి ఎముకల బలానికి ప్రతీక ఎముకలు బలహీనపడినపుడు కీళ్లలో కూడా బలం సడలుతుంది. ఫలితంగా కీళ్లలో నొప్పులు వస్తుంటాయి. ఎముకల్లో సాంద్రత తగ్గేకొద్దీ వెన్నెముక క్రమంగా కంప్రెస్ అవుతుంది. ఫలితంగా ఎత్తు తగ్గినట్టుగా అనిపిస్తారు. చిగుళ్లు దంతాల నుంచి వెనక్కి జరగిపోవడం అనేది దవడ ఎముక బలహీనపడడాన్ని సూచిస్తుంది. Representational image:Pexels