ఎలక్ట్రిక్ టూత్ బ్రష్, సాధారణ టూత్ బ్రష్ లలో ఏది దంత ఆరోగ్యానికి మంచిదనే కన్‌ఫ్యూజన్ చాలామందిలో ఉంది.

ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ లు సోనిక్ లేదా అల్ట్రాసోనిక్ రెండు రకాలుగా ఉంటాయి.

రెండు రకాలు కూడా సమర్థవంతంగా బ్రష్ చెయ్యగలవు.

ఈ మధ్య కాలంలో బిల్ట్ ఇన్ టైమ్స్, రకరకాల ఫోర్స్ ల ఆప్షన్లతో మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.

కొన్ని అధ్యయనాల్లో ఎలక్ట్రిక్ బ్రష్ లు మాన్యువల్ బ్రష్‌ల కంటే చాలా సమర్థవంతమైనవిగా తేల్చాయి.

అయితే మాన్యువల్ బ్రష్ తో పోలిస్తే వీటి ధర పది రెట్లకు పైచిలుకే ఉంటుంది.

బ్యాటరీతో నడిచేవి, ప్లగ్ ఇన్ కార్డ్ తోనూ అందుబాటులో ఉన్నాయి.

మాన్యువల్ బ్రష్ లు కూడా సరిగ్గా వినియోగిస్తే సమర్థవంతంగానే పనిచేస్తాయి.

ఇవి ధర తక్కువ కనుక అందరికీ అందుబాటులో ఉన్నాయి.

వీటిని సరిగ్గా ఉపయోగించినపుడు ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ల మాదిరిగానే దంతాలను శుభ్రం చెయ్యగలవు.
Representational image:Pexels