స్త్రీ శరీరంలో జరిగే అండోత్సర్గము గురించి తెలుసుకుంటే ఎప్పుడు కలిస్తే గర్భం ధరించడం సులువో అర్థం చేసుకోవచ్చు.



పీరియడ్స్ మొదలయ్యే రోజు నుంచి సరిగ్గా ఎనిమిదవ రోజు నుంచి 21వ రోజు మధ్య అండోత్సర్గము జరిగే అవకాశం ఉంది.



ఆ పదిరోజుల్లో గర్భం వచ్చే అవకాశం ఎక్కువ. అండోత్సర్గము జరగడానికి
రెండు రోజుల ముందు లైంగికంగా కలిస్తే గర్భం అవకాశాలు అధికం.


అండం విడుదలయ్యాక భార్యా భర్తలు లైంగికంగా కలిస్తే ఆ అండము స్పెర్మ్ తో.
కలిసి ఫాలోపియన్ ట్యూబులో ప్రయాణించి ఫలదీకరణం చెందుతుంది.


అండోత్సర్గము జరిగే ముందు మహిళల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
పొత్తికడుపులో తేలికపాటి నొప్పి వస్తుంది.


శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉండదు. రొమ్ములు సున్నితంగా మారి నొప్పిగా అనిపిస్తాయి.



లైంగిక ఆసక్తి పెరుగుతుంది. జననేంద్రియాలు వాచినట్టు అనిపిస్తాయి.



పూర్తి ఆరోగ్యవంతురాలైన మహిళలకు నెలకు ఒకసారి మాత్రమే అండోత్సర్గము జరుగుతుంది.



ఈ విషయాల గురించి తెలుసుకుంటే గర్భం దాల్చడం సులభం అవుతుంది.



Images Credit: Pexels