జిడ్డు చర్మంతో పడే ఇబ్బంది నుంచి చిన్నచిన్న చిట్కాలతో బయటపడొచ్చు.

నిమ్మరసం, క్లేతో చేసిన ఫేస్ మాస్క్ అదనపు సీబమ్‌ను పీల్చుకుని, చర్మ రంధ్రాలను టైట్ చేస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ లో నీళ్లు కలిపి దాన్ని టోనర్ గా వాడితే చర్మం pH బ్యాలెన్స్ అయ్యి చర్మం కూడా నిగనిగలాడుతుంది.

ఓట్ మీల్ పౌడర్ ను స్క్రబ్ గా ఉపయోగిస్తే చర్మం మీది అదనపు జిడ్డునే కాదు మృత కణాలను కూడా సున్నితంగా తొలగిస్తుంది.

గుడ్డులోని తెల్లసొనతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే స్కిన్ కి మేట్ అప్పీయరెన్స్ మాత్రమే కాదు ఫ్రెష్ గా కూడా కనిపిస్తుంది.

జిడ్డు చేరకుండా చర్మం హైడ్రేటెడ్ గా ఉండేందుకు ఆలోవెరా జెల్ తో ఇతర ఎసెన్షియల్ ఆయిల్స్ కలిపి మాయిశ్చరైజర్ గా వాడొచ్చు.

గ్రీన్ టీ ని టోనర్ గా వాడితే చర్మంలో ఆయిల్ ఉత్పత్తి రెగ్యులేట్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్ ప్రయోజనాలు కూడా అందుతాయి.

బొప్పాయి గుజ్జును ముఖానికి రాసుకుంటే ముఖానికి ఎంజైమ్ మాస్క్ వేసుకున్న ప్రయోజనాలు అందుతాయి.

చర్మం నిగనిగలాడుతుంది. ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి కాదు, చర్మం రంగు తేలుతుంది.



Representational image:Pexels