కొన్ని ఆయుర్వేద పానీయాలతో జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.

బృంగరాజ్ ఆకులతో కలిసి టీ ఆకులతో కలిసి మంచి పోషకాలు కలిగి తలలో రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది.

మందార పూల కషాయం జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఈ కషాయంతో చుండ్రు కూడా తగ్గుతుంది.

ఉసిరి రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. జుట్టు నల్లగా, పెరిగేందుకు సహాయపడతుంది.

మెంతి గింజల్లో విటమిన్లు, మినరల్స్ ఎక్కువ. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి.

రాత్రంతా నీటిలో మెంతి గింజలు నానబెట్టి ఆనీటిని ఉదయాన్నే తాగాలి.

కొబ్బరి నీరు జుట్టుకు చాలా మంచిది. ఇందులో పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి.

క్రమం తప్పకుండా కొబ్బరినీళ్లు తాగితే జుట్టు రాలడం తగ్గుతుంది.

బ్రహ్మీ టీ మనసుకు, శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది.

ఫలితంగా ఒత్తిడి తగ్గినపుడు జుట్టు రాలడం గణనీయంగా తగ్గిస్తుంది.

వేపాకు ఉడికించి ఆ ద్రావణాన్ని తాగాలి. ఇది రక్త ప్రసరణను శుభ్రం చేస్తుంది. జుట్టు పెరుగుదలను కూడా ప్రొత్సహిస్తుంది.

Representational image:Pexels and pixabay