మనం మనకు తెలియకుండానే చాలా చక్కెర వినియోగిస్తుంటాం. పూర్తిగా చక్కెర మానేస్తే తీవ్రమైన ప్రభావాలు కనిపిస్తాయట. అవేమిటో తెలుసుకుందాం. మన ఆహారాల్లో రెండు రకాల చక్కెరలు ఉంటాయి. అవి అదనంగా చేర్చేవి. సహజంగా ఆహారంలో ఉండేవి. పూర్తిగా చక్కెరను మినహాయించడం దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు. పండ్లు, కూరగాయలు, పాలు, మరికొన్ని గింజల వంటి ఆరోగ్యవంతమైన ఆహారాల్లో సహజంగా చక్కెరలు ఉంటాయి. అదనంగా చక్కెరలు చేర్చిన సోడాలు, బ్రెడ్, ఇతర స్నాక్ బార్ల వంటి వాటి వల్ల నష్టం ఎక్కువ. చక్కెర పూర్తిగా మనేసినపుడు పొగతాగడం అకస్మాత్తుగా ఆపేసినపుడు కలిగే విత్ డ్రావల్ లక్షణాలు కనిపిస్తాయి. నీరసం, తలనొప్పి, జీర్ణసంబంధ సమస్యలు శారీరకంగా కనిపిస్తాయి మొదట్లో చక్కెర కలిగిన పదార్థాలు తినాలనే కోరిక బలంగా కలుగుతుంది. విసుగు, కోపం కలుగుతాయి, బ్రెయిన్ ఫాగ్, విచారంగా అనిపించడం, డిప్రెషన్ మానసిక సమస్యలు కూడా కలుగ వచ్చు. వారం పాటు భరిస్తే తర్వాత అంతా సర్దుకుని మామూలైపోతుంది. Representational images: Pexels