వడ్ల గింజ మీద ఉండే బయటి పొట్టు మాత్రమే తీసేసిన ముతక బియ్యాన్ని బ్రౌన్ రైస్ అంటారు. ఇలా పొట్టుతో ఉండే బియ్యంలో పోషకాలు ఉంటాయి. మెగ్నీషియం, ఫైబర్ బ్రౌన్ రైస్ లో పుష్కలం. ఇవి గుండె ఆరోగ్యానికి మంచిది. బ్రౌన్ రైస్ తో బరువు కూడా తగ్గొచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల తక్కువ తిన్నా కూడా కడుపు నిండుగా ఉంటుంది బ్రౌన్ రైస్ సహజంగానే గ్లుటెన్ ఫ్రీ అని పరిశోధకులు అంటున్నారు. గోధుమ, బార్లీ వంటి వాటిలో ఉండే ప్రొటీన్ గ్లుటెన్. ఇది కొంత మందిలో అలర్జీలకు కారణం అవుతుంది. గ్లుటెన్ సెన్సిటివిటి ఉన్న వారు వీలైనంత వరకు గోధుమ ఉత్పత్తులు తీసుకోకూడదు అలాంటి వారికి రైస్ ఒక మంచి ప్రత్యామ్నాయం. ఏరకమైన రైస్ అయినా సరే గ్లుటెన్ ఫ్రీ అని నిపుణులు చెబుతున్నారు. Representational Image/Pixabay