డయాబెటిస్ ఉంటే తీపి మాత్రమే కాదు, ఇవి కూడా మానేయాలి తిపి తినకుండా ఉంటే చాలు.. డయాబెటిస్ అదే తగ్గిపోతుందని చాలామంది భావిస్తారు. కానీ, అది ఇంకా ప్రమాదం. మిగతా ఆహారాలు కూడా డయాబెటిస్ బాధితులపై ప్రభావం చూపుతాయి. ప్రోసెస్డ్ మీట్‌లో రసాయనాలు ఉంటాయి. అవి డయాబెటిస్ బాధితులకు అస్సలు మంచిది కాదు. ప్రోసెస్డ్ మీట్ ఆరోగ్యవంతులకు కూడా మంచిది కాదు. క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలు రావచ్చు. ప్యాకేజ్డ్ స్నాక్స్, కుకీస్, బిస్కట్స్ వంటి అస్సలు వద్దు. కొవ్వు ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోకూడదు. వైట్ బ్రెడ్, రైస్, పాస్తా వంటి తెల్లని పదార్థాలు.. డయాబెటిస్ రోగులకు మరింత ప్రమాదకరం. ఫ్రెంచ్ ఫ్రైస్, ఆయిల్ ఫుడ్, చికెన్, మటన్ ఫ్రైస్ వంటివి అస్సలు వద్దు. డ్రైఫ్రూట్స్ కూడా అంత మంచిది కాదు. వాటికి బదులు ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవడమే బెటర్. Images and Videos Credit: Pexels