బెడ్ రూమ్‌ను చూస్తే వెంటనే నిద్ర రావాలి లేదా, మూడ్ రావాలి. మీకు రెండోదే కావాలంటే కొన్ని చేయాలి.

బెడ్ రూమ్‌లో వస్తువులు చిందరవందరా ఉంటే.. మూడ్ కాదు కదా, కనీసం నిద్రపోవాలనే ఆలోచనే రాదు.

అందుకే, మీ బెడ్ రూమ్‌ను ఎప్పుడూ శుభ్రంగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంచుకోండి.

మంచం మీద వేసే బెడ్ షీట్స్ ఎప్పుడూ నీట్‌గా ఉండాలి. మూడు రోజులకు ఒకసారి బెడ్ షీట్స్ మార్చండి.

బెడ్ మీద పిల్లో, బెడ్ షీట్స్ తప్పా మరే వస్తువులు ఉండకూడదు.

బెడ్ మీద ఏవైనా వస్తువులుంటే రొమాంటిక్ మూడ్‌లో ఉన్నప్పుడు అవి అంతరాయం కలిగిస్తాయి.

బెడ్ రూమ్‌లో రొమాంటిక్ మూడ్ రావడం కోసం లైట్లన్నీ ఆర్పేసి క్యాండిల్స్ వెలిగించండి.

చక్కని పెర్‌ఫ్యూ్మ్ స్మెల్ కూడా మూడ్ పెంచుతుంది. కాబట్టి, రూమ్‌లో ఫెర్‌ఫ్యూమ్ స్ప్రే చేయండి.

పైన చెప్పినవన్నీ పాటిస్తేనే.. రొమాన్సులో రెచ్చిపోగలరు. లేకపోతే, తూతూ మంత్రమే!

Images and Video Credit: Pexels