పండ్లలో చాలా ఎంజైములు, చక్కెరలు ఉంటాయి. భోజనంలో ప్రొటీన్లు, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉంటాయి. వీటి జీర్ణప్రక్రియ చాలా భిన్నంగా ఉంటంది.

భోజనం తర్వాత వెంటనే పండు తినొద్దు, ఇలా చేస్తే జీర్ణక్రియకు ఆటంకాలు ఏర్పడతాయి.

పండ్ల ద్వారా మంచి ప్రయోజనం పొందాలనుకుంటే ఖాళీ కడుపుతో తినడం మంచిది.

భోజనం తర్వాత కనీసం అరగంట సమయం తీసుకొని పండ్లు తినాలి.

పండ్లరసాలతో పెద్ద లాభం లేదు. పండ్ల రసాలు తీసుకోవడం సౌకర్యంగా ఉండొచ్చు.

పండు పూర్తిగా తిన్నపుడు దానిలోని ఫైబర్ సుగుణాలు కూడా అందుతాయి.

ఫైబర్ లేని పండ్లరసం తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది.

బరువు కూడా పెరగవచ్చు. కాబట్టి వీలైనంత వరకు పండు పూర్తిగా తినేందుకు ప్రయత్నించడమే మంచిది.

నిలువ పెట్టిన పండ్లు తినకూడదు. పండ్లు ఫ్రిజ్ లో ఉంచినపుడు ఎక్కువ రోజులు నిల్వ పెట్టవచ్చు.

కట్ చేసి ఫ్రిజ్ లో ఉంచిన పండు ముక్కల్లో రుచి, పోషకాలు తగ్గిపోవచ్చు.

పండ్లను ఫ్రిజ్ లో కట్ చెయ్యకుండా స్టోర్ చెయ్యడం మంచిది.

రాత్రి పూట పండ్లు తినొద్దు. పండ్లలో ఉండే చక్కెరల వల్ల రాత్రి పూట రక్తంలో షుగర్ స్థాయిలు పెరగవచ్చు. నిద్రకు కూడా అంతరాయం.

పండు తినగానే నీళ్లు తాగొద్దు. పండు తినగానే వెంటనే నీళ్లు తాగితే కడుపులో యాసిడ్లు పలుచబడుతాయి.

అందువల్ల పండ్ల జీర్ణక్రియకు అంతరాయం ఏర్పడవచ్చు. ఫలితంగా కడుపుబ్బరంగా మారొచ్చు.
Representational image:Pexels