బస్సులో, కారులో ప్రయాణించేటప్పుడు మాత్రమే కాదు విమానంలో వెళ్లేటప్పుడు కూడా కొన్ని ఆహార పదార్థాల జోలికి అసలు వెళ్లకూడదు. 30 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించేటప్పుడు పానీయాలు, ఆహారాలు తీసుకోకూడదట. ముఖ్యంగా విమానంలోని పంపు నీటిని అసలు తాగకూడదు. అందులోని నీరు అసహ్యంగా, అపరిశుభ్రంగా ఉంటాయట. ఇది మాత్రమే కాదు కాఫీ, టీ కూడా తీసుకోవద్దని సూచిస్తున్నారు. విమానంలో అందించే ఆహారం కూడా ఎక్కువ సేపు నిల్వ ఉండటం కోసం అధిక ఉప్పు, చక్కెర వేస్తారని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. శాండ్ విచ్, టోస్ట్ విమానంలో ఎక్కువగా తీసుకునే ఆహారం. కానీ అవి టేస్ట్ గా ఉండటం కోసం అధిక మొత్తంలో ఉప్పు వేస్తారట. 40 వేల అడుగుల ఎత్తులో ఆహార పదార్థాలు రుచి మారిపోకుండా ఉండేందుకు ప్రిజర్వేటివ్స్ వేస్తారు. అవి తీసుకుంటే అనారోగ్యం పాలవుతారు. శాండ్ విచ్ కి బదులుగా ఫ్రూట్స్ తో చేసిన సలాడ్ తీసుకోవడం మంచిది. ఎక్కువ మంది ప్రయాణికులు టొమాటో జ్యూస్ తీసుకునేందుకు ఇష్టపడతారు. కానీ దాన్ని తీసుకోకపోవడమే ఉత్తమం. లూజ్ వాటర్ కాకుండా బాటిల్ నీటిని కొనుగోలు చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. Images Credit: Pexels