ఎంత క్లిన్ చేసినా బాత్రూమ్‌లు డర్టీగానే కనిపిస్తాయి. మిలమిలా మెరవాలంటే ఈ చిట్కాలు పాటించండి. వెనిగర్, బేకింగ్ సోడా నీటితో కలిపి బాత్రూమ్ టయల్స్ శుభ్రం చేసే క్లీనర్ తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని టైల్స్ మీద స్ప్రే చేసి ఒక నిమిషం ఆగి గుడ్డతో తుడిస్తే చాలు. బ్లీచింగ్ పౌడర్ బాత్రూమ్ క్లీన్ చేసేందుకు ఒక మంచి ఆప్షన్. రెండు టేబుల్ స్పూన్ల బ్లీచింగ్ పౌడర్‌కు కొద్దిగా నీటిని కలిపి.. ఆ మిశ్రమాన్ని టైల్స్‌కి అప్లై చేయండి. గంట తర్వాత శుభ్రం చేయండి. మరకలు మరీ మొండిగా ఉండే బ్లీచింగ్ పౌడర్ ను పేస్ట్ లా చేసి మరకల మీద రాయండి. 2 గంటల తర్వాత శుభ్రం చేయండి. స్ప్రే బాటిల్ లో నిమ్మరసం నింపి దానితో టైల్స్ మీద స్స్రే చేసి తడిగుడ్డతో తుడిచేస్తే మరకలు పోతాయి. Representational image:Pexels