మెంతులు మాడు మీద రక్త ప్రసరణను పెంచుతుంది. దానివల్ల జుట్టు ఏపుగా పెరుగుతుంది. మెంతుల్లో ఉండే ప్రొటీన్ జుట్టు కుదళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. మెంతులు అద్భుతమైన కండిషనింగ్ లక్షణాలతో ఉంటాయి. మెంతుల పేస్ట్ హెయిర్ మాస్క్ గా ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా తయారవుతుంది. స్కాల్ప్ ఆరోగ్యానికి కూడా మెంతులు దోహదం చేస్తాయి. మెంతుల పేస్ట్ లేదా నూనెను క్రమం తప్పకుండా మాడుకు పట్టిస్తే చుండ్రు సమస్య కూడా తీరుతుంది. మెంతుల్లో ఉండే యాంటీమైక్రోబయల్ లక్షణాల వల్ల స్కాల్ప్ ను ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. మెంతులను తరచుగా జుట్టు పోషణకు వినియోగించడం వల్ల జుట్టు సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. Representational image:Pexels