ఆరోగ్యానికి మంచిదని లెమన్ వాటర్ తెగ తాగేస్తున్నారా!
ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిలో లెమన్ కలుపుకుని తాగితే సులువుగా బరువు తగ్గుతారు.
నిమ్మకాయ జీర్ణక్రియలో చాలా సహాయపడుతుంది. దీని కారణంగా పొట్టకు సంబంధించిన అనేక సమస్యలు తొలగిపోతాయి.
ఏదైనా అతిగా తీసుకోవడం హానికరమే. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో ఈ పోషకాల స్థాయి పెరిగితే చెడు ప్రభావం ఉంటుంది.
విటమిన్ సి అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్ల స్రావం పెరుగుతుంది. దీనివల్ల కడుపులో ఎసిడిటీ ప్రమాదం పెరుగుతుంది.
నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల వాంతులు, విరేచనాలు, వికారం మొదలవుతుంది.
నిమ్మకాయ నోటి దుర్వాసన పోగొట్టి దంతాలను శుభ్రపరుస్తుంది. అయితే అందులో ఉండే సిట్రిక్ యాసిడ్ నోటి కణజాలాలలో వాపును కలిగిస్తుంది. దీని కారణంగా పొక్కులు , చికాకు పుడుతుంది.
ఎక్కువగా నిమ్మరసం తాగితే దంతాలు బలహీనమవుతాయి. ఇందులో ఉండే యాసిడ్స్ దంతాలపై చెడు ప్రభావాన్ని చూపుతాయి.
సిట్రస్ పండ్లు మైగ్రేన్ పెయిన్ పెంచే అవకాశం ఉందని పరిశోధనల్లో వెల్లడైంది
లెమన్ వాటర్ అప్పుడప్పుడు తాగితే పర్వాలేదు కానీ హీట్ తగ్గుతుందనే ఆలోచనతో తరతూ తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు.