అన్వేషించండి

Oscars 2025: ఆస్కార్ సందడి మొదలైంది - అవార్డుల ఈవెంట్ లైవ్ ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

Oscars 2025 Date and Time: ప్రతిష్టాత్మక ఆస్కార్ 2025 అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. ఈ కార్యక్రమ లైవ్ ఈవెంట్‌ను మార్చి 3 నుంచి జియో హాట్ స్టార్‌లో చూడొచ్చు.

Oscars 2025 Event Live Streaming Date And Time Details: సినీ రంగంలో నోబెల్ బహుమతిగా భావించే ప్రతిష్టాత్మక ఆస్కార్ 2025 (Oscar 2025) అవార్డుల పండుగ మొదలైంది. ఈ ఏడాది 97వ ఆస్కార్స్ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వేడుకలు అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌ (Los Angeles) డాల్బీ థియేటర్‌లో జరగనున్నాయి. ఇప్పటికే పలు విభాగాల్లో పోటీ పడుతున్న చిత్రాల లిస్ట్‌ను ప్రకటించారు. భారతీయ కాలమానం ప్రకారం మార్చి 3న (సోమవారం) ఉదయం 5:30 గంటలకు ఆస్కార్స్ వేడుక ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా ప్రముఖ అమెరికన్ టీవీ హోస్ట్, యాక్టర్, కమెడియన్, రైటర్, నిర్మాత కానన్ ఓ బ్రియాన్ (Conan O Brien) హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ ఈవెంట్ లైవ్‌ను భారత సినీ అభిమానులు ABC, Hulu ఫ్లాట్ ఫాంలో చూడొచ్చు. అలాగే, స్టార్ మూవీస్, జియో హాట్ స్టార్‌లో సోమవారం ఉదయం 5:30 గంటల నుంచి చూడొచ్చు.

భారతీయ చిత్రాలకు నిరాశ

ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్లలో భారతీయ చిత్రాలకు తీవ్ర నిరాశ ఎదురైంది. గతేడాది ఆస్కార్ అవార్డుల్లో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'RRR' మూవీలో 'నాటు నాటు' పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి కంగువా, ది గోట్ లైఫ్, ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, స్వాతంత్ర్య వీర సావర్కర్ చిత్రాలు నామినేషన్స్‌లో చోటు దక్కించుకోలేకపోయాయి. అయితే, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నిర్మాతగా వ్యవహరించిన 'అనూజ' షార్ట్ ఫిల్మ్ ఈ ఏడాది నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ మూవీ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్స్‌లో నిలిచింది.

Also Read: ఆ ఓటీటీలోకి నాగచైతన్య 'తండేల్' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఈ ఏడాది 'ఆస్కార్' ఎవరిని వరిస్తుందో..?

ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్‌పై ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బెస్ట్ మూవీ కేటగిరీలో.. ది బ్రూటలిస్ట్, అనోరా, ఎ కంప్లీట్ అన్‌నోన్, ఎమిలియా పెరెజ్, డ్యూన్: పార్ట్ 2, ఐయామ్ స్టిల్ హియర్, నికెల్ బాయ్స్, ది సబ్‌స్టాన్స్, వికెడ్ చిత్రాలు బరిలో నిలిచాయి. అలాగే, బెస్ట్ డైరెక్టర్ విభాగంలో.. సీన్ బేకర్ (అనోరా మూవీ), బ్రాడీ కార్బెట్ (ది బ్రూటలిస్ట్), జేమ్స్ మ్యాన్ గోల్డ్ (ఎ కంప్లీట్ అన్ నోన్), జాక్వెస్ ఆడియార్డ్ (ఎమిలియా పెరెజ్), కోరలీ ఫార్గేట్ (ది సబ్‌స్టాన్స్) నామినేట్ అయ్యారు.

అటు, బెస్ట్ యాక్టర్ బరిలో.. అడ్రియాన్ బ్రాడీ (ది బ్రూటలిస్ట్ మూవీ), తిమోతీ చాలమెట్ (ది కంప్లీట్ అన్‌నోన్), కోల్‌మెన్ డొమినింగో (సింగ్ సింగ్), రే ఫియన్నెస్ (కాన్‌క్లేవ్), సెబాస్టియన్ స్టాన్ (ది అప్రెంటిస్) నామినేట్ కాగా.. ఇక బెస్ట్ యాక్ట్రెస్ విభాగంలో.. సింథియా ఎరివో (విక్‌డ్ మూవీ), కార్లా సోఫియా గాస్కన్ (ఎమిలియా పెరెజ్), మికే మాడిసన్ (అనోరా), డెమిమూర్ (ది సబ్ స్టాన్స్), ఫెర్నాండా టోర్రెస్ (ఐయామ్ స్టిల్ హియర్) బరిలో నిలిచారు. మరి వీరిలో ఎవరినో ఆస్కార్ వరిస్తుందో చూడాలి. హాలీవుడ్ మూవీ 'ఎమిలియా పెరెజ్' అత్యధికంగా 13 విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకోగా.. విక్‌డ్ మూవీ 10 కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకుంది.

Also Read: ఏపీ మహిళా సాధికారిత అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరి - ఆ ప్రచారంలో నిజమెంత?, అలాంటి వారికి వార్నింగ్

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Irumudi Trailer Review : ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది - కూతురినే కాదు ఆడపిల్లలను కాపాడే తండ్రిగా రవితేజ... యాక్షన్ థ్రిల్లర్ విత్ ఎమోషనల్ స్టోరీ
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Embed widget