Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల చెక్కులిచ్చారు - ఆయన దేవుడంటూ యాంకర్ రోషన్ ఎమోషనల్, అసలేం జరిగిందంటే?
Anchor Roshan Emotional: ప్రముఖ యాంకర్ రోషన్ ఓ టీవీ ప్రోగ్రాంలో మెగాస్టార్ చిరంజీవి గొప్పతనాన్ని వివరిస్తూ ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Anchor Roshan About Megastar Chiranjeevi Helping And Emotional: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. యువ హీరోలకు ఆయన ఓ రోల్ మోడల్. అభిమానులను ఆయన ఓ దేవుడు. గత 4 దశాబ్దాలుగా వందకు పైగా సినిమాలతో ప్రేక్షకులను అలరించిన మెగాస్టార్.. 69 ఏళ్ల వయసులోనూ తన నటన, డ్యాన్స్‌తో యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాకుండా అటు సేవా గుణంలోనూ, పొలిటికల్ లీడర్‌గానూ తనదైన ముద్ర వేశారు. ఇండస్ట్రీలో ఎవరికైనా ఆపద వస్తే వెంటనే స్పందిస్తూ వారికి ఆర్థిక సాయం అందింస్తుంటారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ నిర్వహించడం సహా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలతో రియల్ హీరో అనిపించుకున్నారు మన మెగాస్టార్. ఆయన ఏనాడు తాను చేసిన సహాయం గురించి ప్రచారం చేసుకోరు. అయితే, చిరంజీవి నుంచి సాయం పొందిన వారు పలు సందర్భాల్లో మెగాస్టార్ చేసిన సాయం, ఆయన గొప్పతనం గురించి వివరిస్తుంటారు. తాజాగా, ప్రముఖ యాంకర్ రోషన్ సైతం ఓ టీవీ ప్రోగ్రాంలో చిరంజీవి గొప్పతనాన్ని వివరిస్తూ ఎమోషనల్ అయ్యారు.
#MegastarChiranjeevi garu gave 1.5 - 2 Crore worth Cheques to help the needy through me - Anchor Roshan
— Vamc Krishna (@lyf_a_zindagii) March 2, 2025
Asalu ela ra ilanti manishini troll chestaru @KChiruTweets 🥹🥹
Telisinavi ive,ayana teliyakunda entho mandiki help chesadu, #RamCharan is carrying the father’s legacy !! pic.twitter.com/fuajNXNno0
తనకు తల్లిదండ్రులే రియల్ లైఫ్ హీరో హీరోయిన్లని.. తాను ప్రొఫెషనల్‌గా ఈ స్థాయికి రావడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి అని యాంకర్ రోషన్ (Anchor Roshan) తెలిపారు. 'ఓ సినిమా ప్రమోషన్స్ అయిన తర్వాత మీడియాలో సినిమాను ఇలా కూడా ప్రమోషన్స్ చెయ్యొచ్చా అని నన్ను ఇంటికి పిలిచారు. అది వైరల్‌గా మారింది. చిరంజీవి గారు నా దృష్టిలో దేవుడు. రోషన్ వస్తే మినిమం ఓ వన్ అవర్ స్పెండ్ చేద్దాం. వాడు అన్నీ స్టేట్స్ తిరుగుతూ ఉంటాడు. మంచి న్యూస్ చెబుతుంటాడు. అందరి గురించి చెబుతుంటాడు. నా బర్త్ డే కూడా అదే ఇంట్లో కేక్ కట్ చేయించారు. ఎంతోమంది సహాయం చేయాలి అన్నయ్య అని ఓ ఫోన్ చేస్తే దాదాపు ఆయన నాకు రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల వరకూ చెక్స్ ఇచ్చారు.
మీడియాలో కాంట్రవర్సీ చేయడం కాదు. ఒకరికి హెల్ప్ చేయాలంటే రోషన్ తర్వాతే అంటూ సెట్‌లో ప్రతి ఒక్కరికీ నా గురించి చెబుతారు. ఆయనది ఎంతో గొప్ప మనసు. నువ్వు ధైర్యంగా ముందుకెళ్లు. నీ వెనుక నేనుంటా అనే ధైర్యం నాకు ఇచ్చారు మెగాస్టార్. ఆయన నాకు రియల్ హీరో. ఆయనకు పది జన్మలెత్తినా తమ్ముడిగా పుట్టాలని నేను కోరుకుంటాను. చిరంజీవి గురించి చెప్పడానికి నాకు మాటల్లేవ్.' అంటూ రోషన్ ఎమోషనల్ అయ్యారు. అనంతరం స్టేజీపైనే చిరంజీవికి పాదాబివందనం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: ఏపీ మహిళా సాధికారిత అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరి - ఆ ప్రచారంలో నిజమెంత?, అలాంటి వారికి వార్నింగ్






















