Ind Vs NZ Latest Updates: నేడే కివీస్ తో భారత పోరు.. గెలిస్తే టేబుల్ టాపర్.. సెమీస్ లో ఆసీస్ తో ఢీ..!! టీమిండియాలో 2 మార్పులు..!
వన్డేల్లో కివీస్ పై భారత్ పై చేయిగా నిలిచింది. ఇరుజట్ల మధ్య 118 వన్డేలు జరుగగా, 60 మ్యాచ్ ల్లో భారత్, 50 వన్డేల్లో కివీస్ నెగ్గాయి. ఏడింటిలో ఫలితం తేలకపోగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది.

ICC Champions Trophy 2025 2 Changes in Team India: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్-ఏ టేబుల్ టాపర్ న్యూజిలాండ్ తో భారత్ ఢీకొనుంది. ఇరుజట్లకు రెండు పాయింట్లే ఉన్నప్పటికీ, నెట్ రన్ రేట్ పైచేయి ఉండటంతో కివీస్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో విజేత ద్వారా సెమీస్ పై స్పష్టత వస్తుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు టేబుల్ టాపర్ గా నిలిచి, సెమీస్ లో ఆస్ట్రేలియాతో ఢీకొననుంది. ఓడిపోయిన జట్టు.. సౌతాఫ్రికాతో ఆడనుంది. ఇక దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఇరుజట్లు తొలిసారి ముఖాముఖి తలపడుతున్నాయి. అయితే యూఏఈలోని షార్జాలతో మాత్రం ఇరుజట్లు ఐదు సార్లు ఆడగా, నాలుగు సార్లు భారత్ గెలవగా, ఒకసారి మాత్రమే కివీస్ నెగ్గింది. ఇక ఈ టోర్నీలో ఇరుజట్లు పటిష్టంగా కనిపిస్తున్నాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్ పై ఆరు వికెట్ల తేడాతో భారత్ నెగ్గింది. ఇక బంగ్లాపై 5 వికెట్లతో, పాక్ 60 పరుగులతో గెలిచి పటిష్టంగా కనిపిస్తోంది. ఇరుజట్లలోనే ఆటగాళ్లు ఫామ్ లో ఉన్నారు. దీంతో ఈ మ్యాచ్ పోటాపోటీగా జరగునుంది. మ.2.30 గం.ల నుంచి డిస్నీ హాట్ స్టార్, స్పోర్ట్స్ 18 2 ఛానెల్లోప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక ఈ వేదికపై చేజింగ్ చేసిన జట్లకే అనుకూలంగా ఉండటంతో, టాస్ నెగ్గిన టీమ్ బౌలింగ్ ఎంచుకోనుంది.
— BCCI (@BCCI) March 1, 2025
టీమిండియాలో మార్పులు..?
సెమీస్ కు ముందు ఆటగాళ్లకు కాస్త విశ్రాంతినివ్వడంతోపాటు రిజర్వ్ ఆటగాళ్లను భారత్ పరీక్షించే అవకాశముంది. గాయంతో బాధపడతున్న కెప్టెన్ రోహిత్ శర్మ , వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి విశ్రాంతినిచ్చి, వాళ్ల స్థానాల్లో అర్షదీప్ సింగ్, రిషభ్ పంత్ లను తుదిజట్టులోకి తీసుకునే అవకాశముంది. దీంతో రాహుల్ ఓపెనింగ్ చేయనుండగా, వికెట్ కీపర్ గా పంత్ ఆడే అవకాశముంది. టీమిండియాలో ఆటగాళ్లంతా ఫామ్ లో ఉన్నారు. పాక్ పై సెంచరీతో కోహ్లీ తన క్లాస్ ను చాటుకున్నాడు. అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. ఇక కివీస్ టీమ్ లో మైకేల్ బ్రాస్ వెల్, రచిన్ రవీంద్ర సూపర్ టచ్ లో ఉన్నారు.
భారత్ కే అడ్వాంటేజీ..
వన్డేల్లో కివీస్ పై భారత్ పై చేయిగా నిలిచింది. ఇరుజట్ల మధ్య 118 వన్డేలు జరుగగా, 60 మ్యాచ్ ల్లో భారత్, 50 వన్డేల్లో కివీస్ నెగ్గాయి. ఏడింటిలో ఫలితం తేలకపోగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఇండియాతో ఆడిన గత 5 మ్యాచ్ ల్లోనూ భారతే నెగ్గింది. అయితే ఐసీసీ టోర్నీల్లో కివీస్.. ఇండియాకు షాకిస్తోంది. అయితే చివరిసారిగా 2023 వన్డే ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్ జరుగగా, భారత్ ఘనవిజయం సాధించింది. అదే జోరును ఈ మ్యాచ్ లో కొనసాగించాలని జట్టు భావిస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్ లో గెలిస్తే సెమీస్ లో ఆసీస్ ప్రత్యర్థిగా ఎదురవుతందని, అక్కడే ఆ జట్టు ఆట కట్టించి, ఫైనల్ కు చేరుకోవాలని భారత అభిమానులు ఆశిస్తున్నారు. లేకపోతే ఫైనల్లో ఆసీస్ ఎదురయితే భారత్ కి కాస్త ఇబ్బందే ఎదురవుతుదని పేర్కొంటున్నారు. ఇక దుబాయ్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఆడటంతో పిచ్ పై చక్కని అవగాహన ఉండటం, టీమిండియాకే అనుకూలంగా మారనుంది.




















