IND VS NZ Live Score: భారత్ స్పోర్టివ్ స్కోరు.. రాణించిన శ్రేయస్, హార్దిక్.. ఫైఫర్ తో రాణించిన హెన్రీ
ఈ మ్యాచ్ ద్వారా 300వ వన్డే మ్యాచ్ ను పూర్తి చేసుకున్న కోహ్లీ (11) సత్తా చాట లేకపోయాడు. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు గ్రూప్-ఏలో టాపర్ గా నిలుస్తుంది. దీంతో సెమీస్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ICC Champions Trophy 2025 IND Vs NZ Live Score Updates: న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏ ఆఖరి లీగ్ మ్యాచ్ లో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఆదివారం దుబాయ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 249 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (98 బంతుల్లో 79, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్ ద్వారా 300వ వన్డే మ్యాచ్ ను పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ (11) సత్తా చాట లేకపోయాడు. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు గ్రూప్-ఏలో టాపర్ గా నిలుస్తుంది. దీంతో సెమీస్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ ఒక మార్పు చేసింది. పేసర్ హర్షిత్ రాణా స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తుదిజట్టులోకి తీసుకుంది. అలాగే కివీస్ కూడా ఒక మార్పు చేసింది. ఫామ్ లో లేని ఓపెనర్ డేవన్ కాన్వే స్థానంలో డారెల్ మిషెల్ ను జట్టులోకి తీసుకుంది. అలాగే ఈ మ్యాచ్ లో వరుసగా 13వ సారి కూడా భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు.
Innings Break!#TeamIndia have set a 🎯 of 2⃣5⃣0⃣ for New Zealand
— BCCI (@BCCI) March 2, 2025
Over to our bowlers 💪
Scorecard ▶️ https://t.co/Ba4AY30p5i
#NZvIND | #ChampionsTrophy pic.twitter.com/5hLujrNhmN
అద్భుతమైన క్యాచ్..
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. శుభమాన్ గిల్ (2)ను హెన్రీ వికెట్ల ముందు దొరకబుచ్చు కోగా, సిక్స్, ఫోర్ తో జోష్ మీద కనిపించిన రోహిత్ (15)ను జెమీసన్ ఔట్ చేశాడు. ఇక మైల్ స్టోన్ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీని అద్భుతమైన క్యాచ్ తో గ్లెన్ ఫిలిప్స్ ఇంటిముఖం పట్టించాడు. టోర్నీలో మెస్మరైజింగ్ క్యాచ్ లతో మనసు దోచుకుంటున్న ఫిలిప్స్ ఈమ్యాచ్ లోనూ తన మార్కు చూపించాడు. దీంతో 30-3తో భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో అక్షర్ పటేల్ (42) తో కలిసి శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ ను నిర్మించారు. కివీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని చక్కని ఆటతీరు ప్రదర్శించారు. స్టార్టింగ్ లో కుదురుకోడానికి టైం తీసుకున్న వీరిద్దరూ తర్వాత బౌండరీలో రాణించారు.
Outstanding Virat Kohli catch by Glen Philips..#IndiaVsNewZealand #ChampionsTrophy pic.twitter.com/WXPT6TzxXe
— NewsPulse (@NewsPulse_LIVE) March 2, 2025
అయ్యర్ క్లాస్ ఇన్నింగ్స్..
అద్భుతమైన ఫామ్ లో ఉన్న అయ్యర్ మరోసారి తన క్లాస్ ను చూపించాడు. పరుగుల రాక కాస్త కష్టమైన పిచ్ లో అలవోకగా రన్స్ సాధించాడు. అందరు బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని, స్కోరుబోర్డును ముందుకు కదిలించాడు. ఇక అప్పటివరకు కుదురుగా బౌలింగ్ చేసిన కివీస్ బౌలర్లు లెఫ్ట్, రైట్ కాంబినేషన్ తో కాస్త ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో నాలుగో వికెట్ కు 98 పరుగులు జోడించారు. ఆ తర్వాత అక్షర్ ను రచిన్ రవీంద్ర బోల్తా కొట్టించాడు. ఈ దశలో కేఎల్ రాహుల్ (23)తో శ్రేయస్ స్థిరంగా ఆడాడు. 75 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న శ్రేయస్.. సెంచరీ దిశగా దూసుకుపోయాడు. అయితే విల్ ఓ రూర్క్ చక్కని బౌన్సర్ తో శ్రేయస్ ను పెవిలియన్ కు పంపాడు. రాహుల్ , రవీంద్ర జడేజా (16) విఫలం కాగా, చివర్లో హార్దిక్ పాండ్యా సూపర్ ఇన్నింగ్స్ (45) ఆడటంతో భారత్ డీసెంట్ స్కోరును సాధించింది. మిగతా బౌలర్లలో జెమిసన్, ఓ రౌర్క్, కెప్టెన్ మిషెల్ శాంట్నర్, రచిన్ తలో వికెట్ తీశారు.




















