Soundarya Blockbuster Movies: సౌందర్య బ్లాక్ బస్టర్స్... జెమినీ టీవీలో మార్చి 3 నుంచి 9 వరకు... మూవీస్ లిస్ట్, టైమింగ్ తెలుసుకోండి
Telugu TV Movies Today Gemini TV: సౌందర్య సినిమాలతో జెమినీ టీవీ వారోత్సవం చేయడానికి రెడీ అయ్యింది. నెక్స్ట్ వీక్ అంతా మధ్యాహ్నం 3 గంటలకు సౌందర్య సినిమా టెలికాస్ట్ చేయనుంది.

సౌందర్య తెలుగులో ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. అందులో కొన్ని సినిమాలను ప్రేక్షకుల ముందుకు ప్రతి రోజూ టీవీలో తీసుకు రావాలని నిర్ణయించింది జెమినీ టీవీ. మార్చి మూడో తేదీ నుంచి 9వ తేదీ వరకు మధ్యాహ్నం మూడు గంటలకు సౌందర్య బ్లాక్ బస్టర్ సినిమాను టెలికాస్ట్ చేయనుంది. 'మెస్మరైజింగ్ మెమరీస్ - సౌందర్య బ్లాక్ బస్టర్స్' పేరుతో ఏడు రోజుల పాటు వచ్చే ఆ సినిమాలు ఏవో చూడండి.
- మెగాస్టార్ చిరంజీవికి జంటగా సౌందర్య నటించిన బ్లాక్ బస్టర్ సినిమా 'అన్నయ్య' (Annayya movie). ఇందులో చిరు తమ్ముళ్లుగా రవితేజ, వెంకట్ నటించారు. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్చి మూడో తేదీ, సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జెమినీ టీవీలో ప్రసారం కానుంది.
- విక్టరీ వెంకటేష్, సౌందర్యలది సూపర్ హిట్ జోడి. వాళ్ళిద్దరూ కలిసి కొన్ని మెమొరబుల్ సినిమాలు చేశారు. అందులో 'పవిత్ర బంధం' (Pavitra Bandham Movie) ఒకటి. ఆ చిత్రానికి ముత్యాల సుబ్బయ్య దర్శకుడు. మార్చి 4వ తేదీ, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జెమినీ టీవీలో ఈ సినిమా ప్రసారం కానుంది.
- సౌందర్య ప్రధాన పాత్రలో, రమ్యకృష్ణ టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'అమ్మోరు' (Ammoru movie). కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్లలో ఘన విజయం సాధించింది. ప్రేక్షకులకు పూనకాలు తెప్పించింది. మార్చి ఐదో తేదీ, బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ డివోషనల్ సినిమాను టెలికాస్ట్ చేయనుంది జెమినీ టీవీ.
- కృష్ణవంశీ దర్శకత్వంలో సౌందర్య నటించిన సినిమా 'అంతఃపురం' (Anthapuram movie). రాయలసీమలోని ముఠా కక్షలు, ఫ్యాక్షన్ గొడవలను కొత్త కోణంలో చూపించిన చిత్రమిది. ఇందులో సౌందర్య ఎమోషనల్ యాక్టింగ్ ప్రేక్షకులకు అమితంగా నచ్చింది. మార్చి ఆరో తేదీ, గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జెమినీలో ఈ సినిమా ప్రసారం కానుంది.
- కింగ్ అక్కినేని నాగార్జున, శ్రీకాంత్ హీరోలగా నటించిన సినిమా 'నిన్నే ప్రేమిస్తా' (Ninne Premistha movie). ఇందులో సౌందర్య హీరోయిన్. మార్చి 7వ తేదీ, శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సినిమా ప్రసారం కానుంది.
Also Read: 'బ్రహ్మముడి' సీరియల్‌లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ... ఎవరీ యామిని? అలియాస్ సౌమ్యా యాదవ్?
- తెలుగు సినిమాలలో లేడీ గెటప్ వేసిన హీరోలు తక్కువ మంది. వారిలో నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఒకరు. ఆయన లేడీ గెటప్ వేసిన సినిమా 'మేడమ్' (Madam movie). అందులో సౌందర్య హీరోయిన్. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 8వ తేదీ, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జెమినీ టీవీలో ప్రసారం కానుంది.
- కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు, సౌందర్య జంటగా నటించిన 'పెదరాయుడు' (Pedarayudu movie) సినిమాతో సౌందర్య బ్లాక్ బస్టర్స్ ప్రోగ్రాంకి శుభం కార్డు వేయనుంది జెమినీ టీవీ. ఆ సినిమా మార్చి తొమ్మిదో తేదీ, మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారం కానుంది.
Celebrate the legacy of the one and only Soundarya with her mesmerizing masterpieces With #GeminiTV! 🎬✨
— Gemini TV (@GeminiTV) February 25, 2025
Don't miss these iconic films:
🌟 Anthahpuram - March 6th, PM
🌟 Ninne Premistha - March 7th, PM
🌟 Madam - March 8th, PM
🌟 PedaRayudu - March 9th, PM
Join us for this… pic.twitter.com/gVdQeZpq3t
సౌందర్య... ఎవర్ గ్రీన్ బ్యూటీ! తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వచ్చారు. అయితే కొంత మంది మాత్రమే ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాలలో చెరగని స్థానం సొంతం చేసుకున్నారు. అటువంటి కథానాయిక సౌందర్య. ఇప్పటికీ 'మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు?' అని అడిగితే సెలబ్రిటీలలో చాలా మంది సైతం చెప్పే సమాధానం సౌందర్య. ఇప్పటికీ హీరోయిన్ల గురించి చెప్పేటప్పుడు 'ఒక సావిత్రి ఒక సౌందర్య' అని ప్రతి ఒక్కరు చెబుతున్నారు అంటే ఆమె గొప్పతనం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.





















