NTR Death Anniversary: ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాతకు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఘన నివాళి Watch Video
జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘాట్ వద్ద ఘన నివాళి అర్పించారు.

Jr NTR pays tribute at NTR Ghat in hyderabad | హైదరాబాద్: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగు వారు ఆయనను స్మరించుకుంటున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి (NTR Death Anniversary) సందర్భంగా నందమూరి కుటుంబసభ్యులతో పాటు ఆయన అభిమానులు, టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుంటున్నారు.
కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి తాత ఎన్టీఆర్‌కు నివాళి అర్పించారు. నటుడిగా సినీ పరిశ్రమకు నటుడిగా, సీఎంగా తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవల్ని వారు గుర్తు చేసుకున్నారు. మరికాసేపట్లో నందమూరి బాలకృష్ణ, ఏపీ మంత్రి నారా లోకేశ్, నందమూరి కుటుంబసభ్యులు ఘాట్ వద్దకు చేరుకుని ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళి అర్పించనున్నారు.
#WATCH | Hyderabad, Telangana: Junior NTR arrives at NTR ghat and pays tributes to the former CM of united Andhra Pradesh and Telugu film actor NTR on his 29th death anniversary. pic.twitter.com/Cg8Ro7NytZ
— ANI (@ANI) January 18, 2025
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

