Hyderabad Gun Firing News:అఫ్జల్‌గంజ్ కాల్పుల ఘటనలో సాగుతున్న దర్యాప్తు- అమిత్ కుమార్ గ్యాంగ్ కోసం పది బృందాలు గాలింపు
Hyderabad Gun Firing News:బీదర్, అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు జరిపిన అమిత్ కుమార్ గ్యాంగ్ కోసం హైదరాబాద్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఘటన జరిగి దాదాపు 24 గంటలు గడుస్తున్నా పురోగతి లభించలేదు.

Hyderabad Gun Firing News: అఫ్జల్‌గంజ్ కాల్పుల కేసులో ఇంత వరకు ఎలాంటి పురోగతి లేదు. ఘటన జరిగి దాదాపు 24 గంటలు అవుతున్నా పోలీసులకు ఎలాంటి క్లూలు దొరకలేదు. ఇక్కడకు వెళ్లి ఉండొచ్చన్న అంచనాలతో కేసును దర్యాప్తు చేస్తున్నారే తప్ప కచ్చితమైన సమాచారం మాత్రం వాళ్లకు లేదు. అసలు కాల్పులు జరిగిన గ్యాంగ్ ఎటు వెళ్లారనే విషయంపై కూడా క్లారిటీ లేదు. అందుకే మూడు రాష్ట్రాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. వారి బంధవుల ఫోన్లపై నిఘా పెట్టారు.
బీదర్‌లో ఏటీఎం వాహనంలో 93 లక్షలు చోరీ చేసి పారిపోయి హైదరాబాద్‌లో కాల్పులకు తెగబడ్డ ముఠా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ కేసు కోసం ప్రత్యేకంగా పది టీంలను పోలీసులు ఫామ్ చేశారు. బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక పోలీసులతో కోఆర్డినేట్ చేసుకొని కేసు ఛేదించాలని హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయినా ఇంత వరకు ఎలాంటి క్లూను సంపాదించలేకపోయారు. నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు.
అఫ్జల్‌గంజ్‌లో ట్రావెల్స్ ఆఫీస్‌లో కాల్పులు జరిగి బీదర పోలీసుల నుంచి తప్పించుకున్న అమిత్‌కుమార్ ముఠా ఎటు వెళ్లిందనేది ఇంత వరకు పోలీసులు గుర్తించలేకపోయారు. రాయ్‌పూర్ పారిపోయేందుకు ప్రయత్నించి ట్రావెల్స్ సిబ్బంది ఎదురు తిరగడంతో అడ్డంగా దొరికిపోయారు. వారికి డబ్బులు ఆశ చూపినా వారు గొడవ చేయడంతో అంతలోనే పోలీసులు రావడంతో కాల్పులకు జరిపారు.
కాల్పులు జరిగిన అమిత్‌కుమార్ ముఠా రోడ్డుపైకి వచ్చి ఆటోలో ట్యాంక్‌బండ్‌వైపు వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఆ తర్వాత వాళ్లు ఎటు వెళ్లారనేది మాత్రం పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. దేశంలోనే అన్ని ప్రాంతాల్లో కెమెరాలు ఉన్న నగరంగా చెప్పుకొనే హైదరాబాద్‌లో పారిపోయిన దొంగల ఆచూకీ దొరక్కపోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ట్యాంక్‌బండ్ మీదుగా వాళ్లంతా సందుల్లో నుంచి తప్పించుకొని అడ్డదారుల్లో బిహార్ కానీ ఛత్తీస్‌గఢ్ చేరుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read: ఉదయం కర్ణాటకలో కాల్పులు- రాత్రికి హైదరాబాద్‌లో ఫైరింగ్- సినీ ఫక్కీలో చెలరేగిపోయిన బీదర్ గ్యాంగ్
బీదర్, హైదరాబాద్‌లో కాల్పులతో బీభత్సం సృష్టించిన అమిత్‌కుమార్ గ్యాంగ్ ఏటీఎం చోరీ ముఠాగా పోలీసులు తేల్చారు. ఇది బిహార్ ముఠాగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందుకే బిహార్ పోలీసులతో మాట్లాడి వారి వివరాలు తెప్పించారు. బిహార్ పోలీసులు ఇచ్చిన ఆధారాలు, వారు నేరం చేసిన తర్వాత ఎక్కడ దాక్కుంటారనే వివరాలు తెలుసుకున్నారు. వాటి ఆధారంగానే కేసును ఛేదించాలని చూస్తున్నారు. పది టీంలుగా ఏర్పడ్డ సీసీఎస్, టాస్క్‌ఫోర్స్, లా అండ్ ఆర్డర్ విభాగం పోలీసులు అన్ని వైపుల నుంచి వేట సాగిస్తున్నారు.
గురువారం ఉదయం బీదర్‌లో ఏటీఎం డబ్బులు తీసుకెళ్లే వాహనంపై అమిత్‌కుమార్ ముఠా దాడి చేసింది. సిబ్బందిపై కాల్పులు జరిపి ఇద్దర్ని హత్య చేసి 93 లక్షలతో ఉడాయించింది. అక్కడి నుంచి హైదరాబాద్ బాట పట్టారు. అఫ్జల్ గంజ్ వచ్చి రాయ్‌పూర్ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఈ ముఠా ఆచూకీ గుర్తించిన బీదర్ పోలీసులు వారిని పట్టుకునేందుకు హైదరాబాద్ వచ్చారు. ట్రావెల్ ఆఫీస్ వద్ద గలాటా జరగడంతో కాల్పులకు దారి తీసింది. దీంతో నాలుగు రాష్ట్రాల పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.
Also Read: ట్రావెల్స్ సిబ్బంది అప్రమత్తతో బుక్కైన బీదర్ గ్యాంగ్- నోట్లు చూపించి బుట్టలో వేసేందుకు స్కెచ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

