Hyderabad Gun Firing News:ట్రావెల్స్ సిబ్బంది అప్రమత్తతో బుక్కైన బీదర్ గ్యాంగ్- నోట్లు చూపించి బుట్టలో వేసేందుకు స్కెచ్
Hyderabad Gun Firing News:బీదర్‌లో కొట్టేసిన డబ్బులతో పరారయ్యే క్రమంలోనే హైదరాబాద్‌లో కాల్పులకు తెగబడ్డారు. ట్రావెల్స్ సిబ్బందిని కూడా బుట్టలో వేసుకునేందుకు యత్నించారు.

Hyderabad Gun Firing News:కర్ణాటకలోని బీదర్‌లో ఏటీఎం వాహనాన్ని అటకాయించి ఇద్దరి ప్రాణాలు తీసి డబ్బుతో హైదరాబాద్ వచ్చేసిన బీదర్ గ్యాంగ్.. రాయపూర్ పారిపోయేందుకు స్కెచ్ వేసింది. ముగ్గురు సభ్యుల ముఠా బీదర్ నుంచి హైదరాబాద్ చేసుకోగానే రాయపూర్‌కు టికెట్లు చేసింది. హైదరాబాద్‌లోని అఫ్జల్ గంజ్‌లోని ఓ ప్రైవేటు ట్రావెల్స్ వద్దకు వెళ్లి రాయపూర్ వెళ్లేందుకు మూడు టికెట్లు తీసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయి కరెక్ట్‌గా బస్ టైమ్‌కు ట్రావెల్ ఆఫీస్‌కు వచ్చారు.
బ్యాగ్‌లపై అనుమానంతో గుట్టురట్టు
అయితే ట్రావెల్స్ వాళ్లు బస్‌ల వద్దకు ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా మినీ బస్‌లను ఏర్పాటు చేశారు. అందులో వీళ్లు లగేజ్ పట్టుకొని ఎక్కుతుండగా ఆ బ్యాగ్‌లను చూసిన ట్రావెల్స్ సిబ్బందికి ఏదో అనుమానం వచ్చింది. ఒకసారి బ్యాగ్‌లు చూపించాలంటూ ఆ ముగ్గుర్ని అడిగారు.
Also Read: ఉదయం కర్ణాటకలో కాల్పులు- రాత్రికి హైదరాబాద్‌లో ఫైరింగ్- సినీ ఫక్కీలో చెలరేగిపోయిన బీదర్ గ్యాంగ్
నోట్లు ఇచ్చి సిబ్బంది నోరు మూయించాలని చూసిన దుండగులు
ముగ్గురు నిందితులు కూడా తమ బ్యాగ్‌లు తెరవకుండా ఏదో చెప్పాలని చూశారు. ట్రావెల్స్ వాళ్లు మాత్రం చెక్ చేయాల్సిందనంటూ పట్టుబట్టారు. తప్పదని గ్రహించిన బీదర్ గ్యాంగ్ వాళ్లకు బ్యాగ్‌లో ఉన్న నోట్ల కట్టలు చూపించారు. సైలెంట్‌గా ఉంటే ఇందులోని కరెన్సీ కట్టలు తీసుకోవచ్చని సలహా ఇచ్చారు. ఇలా నోట్ల కట్టలు బ్యాగుల నిండా ఉండటంతో ట్రావెల్స్ సిబ్బందికి వారిపై అనుమానం మరింత బలపడింది.
పోలీసుల రాకతో దుండగులు కాల్పులు
ఇంతలో అదే బస్ ఎక్కడానికి వచ్చిన బీదర్ పోలీసులు ఏం జరుగుతుందని ఆరా తీశారు. తాము పోలీసులమేనంటూ చెప్పుకొచ్చారు. అంతే వచ్చింది పోలీసులని గ్రహించిన దుండగులు తమ బ్యాగ్‌ల్లో ఉన్న తుపాకులు తీసి కాల్పులు జరపడం ప్రారంభించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. ట్రావెల్ ఆఫీస్‌లోకి పరుగెత్తుతూ పోలీసులను నుంచి తప్పించుకునేందుకు మేనేజర్‌ను అడ్డు పెట్టుకున్నారు.
Also Read: హైదరాబాద్ నడిబొడ్డున బీదర్ దొంగల కాల్పులు - ఆఫ్జల్ గంజ్‌లో హైవోల్టేజ్ ఆపరేషన్
మేనేజర్‌కు గాయాలు - ఆసుపత్రిలో చికిత్స
ఈ క్రమంలోనే మేనేజర్ కాలు, కడుపులో కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో మేనేజర్ జహంగీర్‌కు గాయాలు అయ్యాయి. ఇలా కాల్పులు జరుపుతూ అందర్నీ భయభ్రాంతులకు గురి చేస్తూ తమ బ్యాగ్‌లు తీసుకొని దుండగులు పరారయ్యారు. వారిని పట్టుకునేందుకు బీదర్ పోలీసులు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. కాల్పుల సమాచారం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు వెళ్లి బీదర్ ఖాకీల నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. అనంతరం విచారణ ప్రారంభించారు.
గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు
పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకున్న దొంగల కోసం హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, ఇతర అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా గాలిస్తున్నారు. వారి ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజ్ జల్లెడ పడుతున్నారు. అయితే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంత వరకు పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

