Crime News: బాయ్‌ఫ్రెండ్‌తో యువతి ఛాటింగ్ - అక్కకు తెలిసిందన్న భయంతో సూసైడ్, హైదరాబాద్‌లో ఘటన
Crime News: బాయ్ ఫ్రెండ్‌తో ఛాట్ చేస్తోన్న విషయం అక్కకు తెలియడంతో ఆ యువతి ఆందోళనకు గురైంది. తల్లిదండ్రులకు తెలిస్తే ఏం జరుగుతుందోనన్న భయంతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది.

Young Woman Forceful Death In Hyderabad: ప్రస్తుతం కొందరు యువత చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్‌తో ఫోన్‌లో ఛాటింగ్ చేస్తోన్న విషయం తన అక్కకు తెలిసిందని ఆందోళనకు గురై బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిపేట జిల్లాకు (Siddipeta District) చెందిన భార్గవి హైదరాబాద్‌లోని (Hyderabad) హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ సెకండియర్ చదువుతోంది. అయితే, తన బాయ్ ఫ్రెండ్‌తో చాట్ చేస్తున్నట్లు అక్కకు తెలియడంతో ఆందోళనకు గురైంది. తల్లిదండ్రులకు చెబితే ఏం జరుగుతుందోనన్న భయంతో హైదరాబాద్ - జామై ఉస్మానియా రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.
Also Read: Hanumakonda Murder Case: హనుమకొండలో పట్టపగలే దారుణం, నడిరోడ్డుపై ఆటోడ్రైవర్ దారుణహత్య
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

