Minister Harish Rao : పెట్రోల్, డీజిల్ సుంకాల తగ్గింపుపై స్పందించిన మంత్రి హరీశ్ రావు, ఏమన్నారంటే?
Minister Harish Rao : పెట్రోల్, డీజిల్ పై కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించడంపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎలాంటి పన్నులు విధించలేదన్నారు. బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారం బోగస్ అన్నారు.
Minister Harish Rao On Petrol Diesel Price Cut : కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకం తగ్గించింది. దీనిపై కేంద్ర మంత్రులు స్పందిస్తూ ఇక రాష్ట్ర ప్రభుత్వాల వంతని, పెట్రోల్ , డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని సూచిస్తున్నారు. దీనిపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పందించారు. కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై పెంచింది బారాణా అయితే తగ్గించింది చారాణా అంటూ సెటైర్లు వేశారు. మార్చి 2014లో ఉన్న ఎక్సైజ్ సుంకాలను తీసుకువచ్చి కేంద్రం ప్రభుత్వం మాట్లాడాలని సవాల్ విసిరారు. బీజేపీ నేతలు ఎందుకు పాలాభిషేకాలు చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించాలని బీజేపీ నేతలు చేస్తు్న్న డిమాండ్‌పై మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి పన్నులు విధించలేదని చెప్పారు. పెట్రోల్, డీజిల్ సుంకం తగ్గించినట్లు బీజేపీ నేతలు చేసుకుంటున్న ప్రచారం అంతా బోగస్ అని విమర్శించారు. గ్యాస్ ధరలు పెంచి పేదలకు ఇచ్చే సబ్సిడీ ఎగ్గొట్టారంటూ హరీశ్ రావు మండిపడ్డారు.
గాంధీ ఆసుపత్రిలో రూ. 13 కోట్ల విలువైన అత్యాధునిక ఎంఆర్ఐ మిషన్, రూ. 9 కోట్ల విలువైన క్యాత్ ల్యాబ్ ను ప్రారంభించిన వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు గారు. pic.twitter.com/jOn9ELQMX5
— Office of Minister for Health, Telangana (@TelanganaHealth) May 22, 2022
కొత్త వేరియంట్ పై మంత్రి ఏమన్నారంటే?
హైదరాబాద్ లో వేరియంట్ కేసు నమోదుపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. కరోనా కొత్త వేరియంట్ తో ప్రమాదమేమి లేదన్నారు. రూ.100 కోట్లతో గాంధీ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తున్నామన్నారు. రూ.30 కోట్లతో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అధునాతన యంత్రాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. సంతాన సాఫల్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. డ్రైనేజీ, ఫైర్ సెఫ్టీ, డ్రింకింగ్ వాటర్, పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు. ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు ఎక్కువ ఖర్చుచేసుకోవద్దని సూచించారు. డీజిల్, పెట్రోల్ ధరలు కేంద్రం తగ్గించడం బోగస్ అని వ్యాఖ్యానించారు.
గాంధీ ఆసుపత్రిలో అత్యాధునిక సదుపాయాలు
గాంధీ ఆసుపత్రిలో రూ.13 కోట్ల విలువైన అత్యాధునిక ఎంఆర్ఐ మెషీన్, రూ.9 కోట్ల విలువైన క్యాత్ ల్యాబ్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలసి ఆదివారం మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కొత్త వేరియెంట్ కేసు నమోదు కావడంపై మాట్లాడిన ఆయన కొత్త వేరియెంట్ వల్ల ప్రమాదం లేదన్నారు. కొత్త వేరియంట్ కేసు ఒకటి నమోదు అయిందని, ఆ వ్యక్తి కాంటాక్ట్‌లను పరీక్షించామన్నారు. ఎలాంటి పాజిటివ్ కేసులు రాలేదని స్పష్టం చేశారు. రూ.30 కోట్లతో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ థియేటర్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నామని, దీని ద్వారా ఆరు రకాల అవయవాల మార్పిడి చేయొచ్చున్నారు. సంతాన సాఫల్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.