అన్వేషించండి

బాత్రూంలో స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? - అయితే రోగాలు కొని తెచ్చుకున్నట్లే - ఎందుకంటే?

మీరు బాత్‌రూమ్‌లో కూడా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకు అనారోగ్యం సోకే అవకాశం ఎక్కువ.

కరోనా వైరస్ తర్వాత ప్రజలు తమ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం ప్రారంభించారు. ఎప్పటికప్పుడు వారి చేతులను శుభ్రపరచుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి. ప్రతి వ్యక్తి సాధారణంగా రోజులో ఆరు నుండి ఎనిమిది సార్లు చేతులు కడుక్కోవాలి. అయినప్పటికీ మనందరి చేతుల మీద వేలాదిగా బ్యాక్టీరియా ఉంది. దీనికి కారణం మీ స్మార్ట్‌ఫోన్ అంటే మీరు ఆశ్చర్యపోతారు. వాస్తవానికి మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే టాయిలెట్ సీట్ల కంటే 10 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా మన స్మార్ట్‌ఫోన్‌లపై కనిపిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది.

టాయిలెట్ సీటుపై అన్ని పనులు జరుగుతున్నాయి
నార్డ్‌వీపీఎన్ అధ్యయనం ప్రకారం 10 మందిలో ఆరు మంది తమ ఫోన్‌ను వాష్‌రూమ్‌కు తీసుకువెళతారు. వీరిలో ముఖ్యంగా యువత ఎక్కువగా ఉంది. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో 61.6% మంది టాయిలెట్ సీటుపై కూర్చొని ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఖాతాలను చెక్ చేస్తునట్లు అంగీకరించారు.

అధ్యయనం ప్రకారం దాదాపు మూడో వంతు (33.9%) మంది ప్రజలు బాత్రూమ్‌లో కరెంట్ అఫైర్స్ చదువుతున్నారు. పావువంతు (24.5%) మంది తమకు ఇష్టమైన వారికి మెసేజ్‌లు పంపుతున్నారు. తమ జీవితానికి సంబంధించిన కొన్ని సమస్యలను, దాని పరిష్కారాన్ని టాయిలెట్ సీటుపైన కూర్చునే ఆలోచిస్తూ ఉంటారు.

స్మార్ట్‌ఫోన్‌ను ఎల్లవేళలా ఉపయోగించే అలవాటు కూడా చాలా చెడ్డది. కానీ మీరు దానిని టాయిలెట్ సీటుపై పెట్టినప్పుడు ప్రమాదం మరింత పెరుగుతుంది. టాయిలెట్ సీటులో ఉండే బ్యాక్టీరియా స్మార్ట్‌ఫోన్ ఉపరితలంపైకి వచ్చి, ఆపై అవి మన చేతుల ద్వారా మన శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. దీని కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు.

టచ్ స్క్రీన్ అనేది డిజిటల్ దోమ
మొబైల్ ఫోన్ స్క్రీన్‌పై బ్యాక్టీరియా 28 రోజుల పాటు జీవించగలదని నివేదిక ద్వారా తెలిసింది. ఈ నివేదికలో ఇన్ఫెక్షన్ నియంత్రణ నిపుణుడు డాక్టర్ హ్యూ హేడెన్, యాహూ లైఫ్ యూకేతో మాట్లాడుతూ, స్మార్ట్‌ఫోన్‌లు టాయిలెట్ సీట్ల కంటే 10 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియాను కలిగి ఉంటాయనేది నిర్ధారితం అయిన వాస్తవం అన్నారు. స్మార్ట్‌ఫోన్ టచ్‌స్క్రీన్ డిజిటల్ యుగానికి చెందిన దోమ అని ఆయన అన్నారు. అందుకే స్మార్ట్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్స్ వంటివి వాష్‌రూమ్‌కి తీసుకెళ్లకుండా మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మంచిదని సూచించారు.

మరో వైపు వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీని మరింత టైట్ చేయడానికి మెటా ఇటీవల ఛాట్ లాక్ ఫీచర్‌ను యాడ్ చేసిన సంగతి తెలిసిందే. దాని సహాయంతో మన వాట్సాప్‌లో కావాల్సిన ఛాట్లను లాక్ చేయవచ్చు. ఛాట్‌ను లాక్ చేయడానికి, మీరు ఆ యూజర్ ప్రొఫైల్‌కు వెళ్లి అక్కడ కనిపించే ఛాట్ లాక్ ఆప్షన్‌ను ఆన్ చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆ ఛాట్ పూర్తిగా మరో ఫోల్డర్‌కి మూవ్ అయిపోతుంది. మీరు కూడా ఈ వాట్సాప్ ఫీచర్‌ని ఉపయోగిస్తున్నట్లయితే కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి.

మీరు వాట్సాప్‌లో ఛాట్‌ను లాక్ చేసినట్లయితే, అది వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో లాక్ అవ్వదని గుర్తించాలి. అంటే వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో ఆ ఛాట్‌ను ఎవరైనా చూడగలరన్న మాట. మీరు వాట్సాప్ వెబ్‌లో మీ అకౌంట్‌ను ఓపెన్ చేసి ఉంచినట్లయితే, అవతలి వ్యక్తి మీరు లాక్ చేసిన ఛాట్‌లను చూడగలరు. మీరు ఛాట్ లాక్ ఫోల్డర్‌ను ఓపెన్ చేసి, ఆ విండోను క్లోజ్ చేయడం మర్చిపోయినా కూడా మీరు లాక్ చేసిన ఛాట్‌లను వేరే వ్యక్తులు చదవగలరు.

Read Also: వాట్సాప్‌లో కొత్త నంబర్ల నుంచి కాల్స్ విసిగిస్తున్నాయా? - ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే చాలు!

టాప్ హెడ్ లైన్స్

WhatsApp Business API Pricing Changes: వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారా? - ఏపీఐ కొత్త ఛార్జీలు ఇవే!
వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారా? - ఏపీఐ కొత్త ఛార్జీలు ఇవే!
AI To SI: కృత్రిమ మేధ పేరు మార్పుతో ముప్పు తొలగిపోతుందా? AI నుంచి SI పేరు మార్పు వెనుక అసలు సవాళ్లు!
కృత్రిమ మేధ పేరు మార్పుతో ముప్పు తొలగిపోతుందా? AI నుంచి SI పేరు మార్పు వెనుక అసలు సవాళ్లు!
Water Based Battery: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!
WhatsApp Android Redesign: ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ అదిరిపోయే అప్‌డేట్.. ఐఫోన్ లాంటి కొత్త డిజైన్!
ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ అదిరిపోయే అప్‌డేట్.. ఐఫోన్ లాంటి కొత్త డిజైన్!

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Khairatabad Bypoll Stay: ఖైరతాబాద్ సమరంలో బిగ్ ట్విస్ట్ - హైకోర్టుకు ఈసీ క్లారిటీ - ఇప్పుడల్లా నోటిఫికేషన్ లేనట్లే!?
ఖైరతాబాద్ సమరంలో బిగ్ ట్విస్ట్ - హైకోర్టుకు ఈసీ క్లారిటీ - ఇప్పుడల్లా నోటిఫికేషన్ లేనట్లే!?
KTR Counter: రేవంత్ పులి కాదు.. చంద్రబాబు పెంపుడు పిల్లి- ఆ హోటల్స్ నావే - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
రేవంత్ పులి కాదు.. చంద్రబాబు పెంపుడు పిల్లి- ఆ హోటల్స్ నావే - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Danam Nagender: ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
Flydubai Flight 1073 Attack: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
Dorothy Telugu Trailer : ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
ఇద్దరి మగాళ్ల మధ్య ప్రేమ - కీర్తి సురేష్ బోల్డ్ మూవీ... కాంట్రవర్సియల్ డోరతీ తెలుగు ట్రైలర్ చూశారా?
Irumudi Like Incident In Ongole: ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
ఒంగోలులో 'ఇరుముడి' తరహా ఘటన.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి బాలికలను పంపిన వంట మనిషి!
Infection Linked Cancer Cases : ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
ఇన్​ఫెక్షన్​ల​తో పెరుగుతోన్న క్యాన్సర్ కేసులు.. లాన్సెట్ అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Khairatabad Assembly Bypoll 2026: ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
Embed widget