Whatsapp Tips: వాట్సాప్‌లో కొత్త నంబర్ల నుంచి కాల్స్ విసిగిస్తున్నాయా? - ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే చాలు!
వాట్సాప్‌లో కొత్తగా వచ్చిన ‘సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్’ ఫీచర్ ఎనేబుల్ చేయడం ఎలా?
WhatsApp New Feature: వాట్సాప్‌లో ఇప్పుడు యూజర్లకు తలెత్తిన మరో సమస్య తెలియని నంబర్ల నుంచి వచ్చే స్పామ్ కాల్స్. అయితే వాట్సాప్ ఇప్పుడు దీని కోసం కూడా కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. తెలియని నంబర్ల నుంచి వచ్చే స్పామ్ కాల్స్‌ను సైలెన్స్ చేయవచ్చు. ఈ ఫీచర్‌ను వాట్సాప్ గత వారమే విడుదల చేసింది. ప్రస్తుతం ఆండ్రాయిడ్, ఐవోఎస్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే వాట్సాప్ కాల్ సైలెన్స్ అయినా హిస్టరీలో కాల్స్ కనిపిస్తాయి. కానీ రింగ్ మాత్రం అవ్వవు.
మీరు ఈ ఫీచర్ ఉపయోగించాలంటే కింది టిప్స్ ఫాలో అవ్వండి.
1. మీ స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి.
2. అందులో ‘సెట్టింగ్స్’లోకి వెళ్లి, ‘ప్రైవసీ’ ఆప్షన్‌ను ఎంచుకోండి.
3. ‘ప్రైవసీ’లో ‘కాల్స్’ను సెలక్ట్ చేయండి.
4. అందులో 'Silence Unknown Calls'ను ఎనేబుల్ చేయండి.
ఒకవేళ కొత్త నంబర్ నుంచి వచ్చే కాల్స్ అటెండ్ చేయాలనుకుంటే దాన్ని డిజేబుల్ చేసుకుంటే సరిపోతుంది. కానీ అప్పుడు స్పామ్ కాల్స్ బారిన పడే ప్రమాదం ఉంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారు. వాట్సాప్‌కు కేవలం భారతదేశంలోనే 500 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్, వెబ్‌లో వాట్సాప్‌ను కోట్లాది మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు.
యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరచడానికి కంపెనీ యాప్‌లో కొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు తీసుకు వస్తూనే ఉంటుంది. అయితే విండోస్ యూజర్ల కోసం కంపెనీ యాప్‌లో కొత్త ఆప్షన్‌ను ఇచ్చింది. దీని సహాయంతో వాట్సాప్ అఫీషియల్స్‌ను సంప్రదించడం మరింత సులభం అయింది.
ఆ అప్‌డేట్ ఏంటంటే?
వాట్సాప్ ఫీచర్లను ట్రాక్ చేసే వెబ్‌సైట్ Wabetainfo కథనం ప్రకారం కంపెనీ విండోస్ వినియోగదారులకు కూడా యాప్‌లో ఛాట్ సపోర్ట్‌ను అందించడం ప్రారంభించింది. అంటే ఇప్పటి వరకు కేవలం మొబైల్‌లో మాత్రమే దీనికి సంబంధించిన హెల్ప్ సపోర్ట్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు విండోస్ యూజర్‌లు కూడా తమ డెస్క్ టాప్‌లో యాప్‌లో ఈ ఫీచర్‌ను పొందుతారు.
వినియోగదారులు ఛాట్ లేదా మెయిల్‌లో కూడా వారి ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవచ్చు. విండోస్ వినియోగదారులకు కూడా ఈ అప్‌డేట్‌ను దశల వారీగా లభిస్తుంది. ఈ ఫీచర్ ప్రయోజనం ఏంటంటే వినియోగదారులు సర్వీసుకు సంబంధించిన సమస్యలకు యాప్‌లోనే పరిష్కారం పొందవచ్చు. వారు యాప్ నుంచి బయటకు రావాల్సిన అవసరం లేదు.
అలాగే వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లపై కూడా పనిచేస్తోంది. ఇందులో యూజర్‌నేమ్, వీడియో కాల్ సమయంలో స్క్రీన్ షేర్, కాల్ బ్యాక్ బటన్ మొదలైనవి కూడా ఉన్నాయి. యూజర్‌నేమ్ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చిన తర్వాత యూజర్‌లు తమ అకౌంట్‌కు ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌ను సెట్ చేసుకోవాలి. దీని సహాయంతో వారు ఇతరులను కాంటాక్ట్స్‌కు యాడ్ చేయవచ్చు. ఇక స్క్రీన్ షేర్ ఫీచర్ సహాయంతో, వినియోగదారులు వీడియో కాల్స్ సమయంలో మొబైల్, ల్యాప్‌టాప్ నుంచి కూడా తమ స్క్రీన్‌ను షేర్ చేయగలరు. ఇది ఇన్ యాప్ కమ్యూనికేషన్‌ను మరింత మెరుగుపరుస్తుంది.
Read Also: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?