Sumaya Reddy: స్టేజీ మీదే కన్నీళ్లు పెట్టుకున్న నటి సుమయా రెడ్డి - మీ కోసం మీరే నిలబడాలంటూ ఎమోపషనల్ స్పీచ్
Sumaya Reddy Emotional: తెలుగమ్మాయి, నటి సుమయారెడ్డి స్టేజీపైనే ఎమోషనల్ అయ్యారు. 'డియర్ ఉమ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అమ్మాయిలు ఎవరి కోసం వారే నిలబడాలంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Actress Sumaya Reddy Get Emotional In Dear Uma Pre Release Event: ప్రముఖ నటి, తెలుగమ్మాయి సుమయా రెడ్డి హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ 'డియర్ ఉమ'. ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుమయారెడ్డి ఎమోషనల్ అయ్యారు.
నటి కన్నీళ్లు
జీవితంలో రిజెక్షన్స్ సర్వ సాధారణమని.. అమ్మాయిలంతా మీకు మీరే ధైర్యంగా నిలబడాలని నటి సుమయారెడ్డి అన్నారు. 'అమ్మాయిలందరికీ చెబుతున్నా.. రిజెక్షన్స్ వెరీ కామన్. మీ కోసం మీరు ధైర్యంగా నిలబడాలి. ఎవరి సాయం కోసమో ఎదురుచూడొద్దు. మీకోసం మీరు నిలబడకుంటే మీకోసం ఎవరూ నిలబడరు. మిమ్మల్ని, మీకు మీరే హెల్ప్ చేసుకోవాలి. మనం ఎదుర్కొనే సమస్యలు ఏవీ అందరికీ చెప్పుకోలేం. ఓ ఫ్రెండ్‌కు మాత్రమే చెప్పుకోగలం.' అని కన్నీళ్లు పెట్టుకున్నారు.
'ఓ అడుగు ముందుకేసి మూవీ నిర్మించా'
తెలుగమ్మాయిలు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎక్కువగా వస్తున్నారని.. తాను ఓ అడుగు ముందుకు వేసి సినిమాని నిర్మించానని సుమయారెడ్డి అన్నారు. 'అనంతపూర్ నుంచి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడి కాయ కొట్టే వరకు సపోర్ట్ చేసిన మీడియాకు థాంక్స్. నేను రాసిన, తీసిన షార్ట్ ఫిల్మ్‌కు మంచి ఆదరణ దక్కింది. ఆ తరువాత సాయి రాజేష్ గారితో మళ్లీ డియర్ ఉమకు పని చేశాం. నాకు అండగా నిలిచిన మధు, చక్రవర్తిలకు థాంక్స్. ప్రతీ మగాడి విజయం వెనుక ఆడది ఉన్నట్టే.. ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయి ఉంటాడు. నగేష్ ఈ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచీ నాతో పాటే ఉన్నారు. మీ కోసం మీరు నిలబడకపోతే, మీ కోసం ఎవరూ నిలబడరు. ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్ట్‌ను ఇక్కడి వరకు తీసుకు వచ్చాను. మా సినిమాని విజయవంతం చేయండి' అని అన్నారు.
Also Read: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ 'శివంగి' మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
డియర్ ఉమ సినిమాకు పని చేయడం చాలా ఆనందంగా ఉందని నటుడు పృథ్వీ అంబర్ అన్నారు. 'మొదట్లో తెలుగు అంతగా అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు తెలుగు నేర్చుకుంటున్నా. సుమయా రెడ్డి ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు. ఏప్రిల్ 18న సినిమా అందరూ చూడండి’ అని అన్నారు.
'బుర్రకథ' సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న సమయంలోనే సుమయ రెడ్డిని కలిశానని.. ఇద్దరం ఓ షార్ట్ ఫిల్మ్‌కు పని చేశామని.. డైరెక్టర్ సాయిరాజేష్ అన్నారు. 'కరోనా టైంలో సుమయ రెడ్డి రాసిన కథ నాకు చాలా నచ్చింది. అలా డియర్ ఉమ చిత్రం మొదలైంది. మేం ఈ కథను నమ్మి చాలా మంది వద్దకు తిరిగాం. కానీ కథలో చాలా మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. అందుకే సుమయ రెడ్డి గారే స్వయంగా నిర్మించేందుకు ముందుకు వచ్చారు. సమాజానికి ఓ సందేశాన్ని ఇవ్వాలని ఆమె సినిమాను నిర్మించారు. ఈ సినిమా అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
ఈ నెల 18న రిలీజ్
'మెడికల్ మాఫియా' ప్రధానాంశంగా 'డియర్ ఉమ' సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా నటించారు. కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్ ఘోష్, సీనియర్ హీరోయిన్ ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, 'బలగం' రూపలక్ష్మీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై సుమయారెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఈ నెల 18న (శుక్రవారం) సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.






















