Virat Kohli Captaincy Row: కోహ్లీ, గంగూలీలో ఎవరిది అబద్ధమంటే.. రవిశాస్త్రి కామెంట్స్!
గంగూలీ, కోహ్లీలో ఎవరు అబద్ధమాడుతున్నారని అడగ్గా రవిశాస్త్రి ఆచితూచి జవాబు చెప్పాడు. విరాట్ తనవైపు కథనం వివరించాడు. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు తనవైపు కథనం చెప్పాల్సిన అవసరం ఉందన్నాడు.
టీమ్‌ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వివాదంపై మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. చక్కని కమ్యూనికేషన్‌తో వన్డే కెప్టెన్సీ వ్యవహారాన్ని మరింత సమర్థంగా హ్యాండిల్ చేయాల్సిందని పేర్కొన్నాడు. కోహ్లీ తనవైపు కథ చెప్పాడని, దాదా చెప్పేంత వరకు ఎవరిది అబద్ధమో చెప్పలేమని వెల్లడించాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో ఆయన మాట్లాడాడు.
'విరాట్ తనవైపు కథనం వివరించాడు. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు తనవైపు కథనం చెప్పాల్సిన అవసరం ఉంది. లేదా ఏం జరిగిందో స్పష్టత ఇవ్వాలి. అంతే' అని శాస్త్రి అన్నాడు. 'ఈ వ్యవస్థలో నేను కొన్నేళ్లుగా ఉన్నాను. ఏడేళ్లుగా ఈ జట్టుతో కలిసి ప్రయాణించాను. బయట మాట్లాడే బదులు చక్కని కమ్యూనికేషన్‌తో వ్యవహారాన్ని మరింత మెరుగ్గా డీల్ చేయాల్సింది' అని ఆయన పేర్కొన్నాడు.
ఇంతకీ గంగూలీ, కోహ్లీలో ఎవరు అబద్ధమాడుతున్నారని అడగ్గా రవిశాస్త్రి ఆచితూచి జవాబు చెప్పాడు. 'ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియనంత వరకు మాట్లాడటం సరికాదు. వారు అసలు ఏం మాట్లాడుకున్నారు, దేని గురించి మాట్లాడుకున్నారు, ఎలా మొదలైంది, ఎక్కడ ముగిసిందన్నది తెలియాలి. ఆ వివరాలన్నీ తెలిస్తేనే డాట్స్‌ను కలపగలం. ఏది సరైందో తెలుస్తుంది' అని శాస్త్రి వివరించాడు.
విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ తొలగింపు వ్యవహారం చినికిచినికి గాలివానగా మారిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా సిరీసుకు బయల్దేరే ముందు కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. టీ20 కెప్టెన్సీ నుంచి దిగిపోయేటప్పుడు ఎవరూ తనను వారించలేదని గంగూలీని ఉద్దేశించి చెప్పాడు. కాగా అంతకు ముందు విరాట్‌ను టీ20 కెప్టెన్సీ వదిలేయొద్దని వ్యక్తిగతంగా చెప్పానని దాదా వివరించాడు. వీరిద్దరి మాటల మధ్య వైరుధ్యం ఉండటంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది.
Also Read: Vengsarkar On Kohli: కోహ్లీ కెప్టెన్సీ వివాదం.. దాదాకు ఆ అధికారం లేదన్న వెంగీ!
Also Read: IND vs SA: లంబూను కాదని సిరాజ్‌కే తొలి ఓటు..! శార్దూల్‌ను ఎంచుకుంటే మంచిదన్న ఎమ్మెస్కే
Also Read: IPL 2022: సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్‌గా లారా.. పూర్తి వ్యూహాత్మక బృందం ఇదే!
Also Read: Thaggedhe Le: ‘నీ అంత బాగా చేయలేదు బన్నీ’ అన్న జడ్డూ.. ఎందుకంటే?
Also Read: 83 Film Update: ప్రపంచకప్ గెలిచిన రోజు పస్తులతో పడుకున్న కపిల్ డెవిల్స్..! ఎందుకో తెలుసా?
Also Read: Pro Kabaddi 2021: ప్రో కబడ్డీ మ్యాచ్‌ల్లో విజేతలు వీరే.. ఒక మ్యాచ్ ఉత్కంఠభరితంగా!