IND vs SA: లంబూను కాదని సిరాజ్‌కే తొలి ఓటు..! శార్దూల్‌ను ఎంచుకుంటే మంచిదన్న ఎమ్మెస్కే
తొలి టెస్టులో ఇషాంత్‌కు చోటు దక్కడం కష్టమేనని వెల్లడించారు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు నేరుగా చోటు దొరుకుతుందని మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అంచనా వేశారు.
ఐదుగురు బౌలర్ల ఫార్ములాను అనుసరిస్తే శార్దూల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకోవడం మంచిదని మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అంటున్నారు. ఈ ఏడాది అతడు చక్కని ఫామ్‌లో ఉన్నాడని పేర్కొన్నారు. తొలి టెస్టులో ఇషాంత్‌కు చోటు దక్కడం కష్టమేనని వెల్లడించారు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు నేరుగా చోటు దొరుకుతుందని అంచనా వేశారు. పీటీఐతో ఆయన మాట్లాడారు.
మూడేళ్లుగా టీమ్‌ఇండియా ఐదుగురు బౌలర్ల సూత్రాన్ని అనుసరిస్తోంది. పిచ్‌ను బట్టి నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ లేదా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లను ఎంచుకుంటున్నారు. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో కోహ్లీసేన డిసెంబర్ 26న తొలి టెస్టు ఆడనుంది. మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు ఖాయమేనని భావిస్తున్నారు. ఐదో బౌలర్‌గా శార్దూల్ అవకాశం దొరకొచ్చని అనుకుంటున్నారు. ఈ ఏడాది అతడు 3 మ్యాచుల్లో 22.07 సగటుతో 14 వికెట్లు తీశాడు. 37.20 సగటుతో 232 పరుగులు సాధించాడు. ఆసీస్‌పై గబ్బాలో అతడి ఆటను ఎంత పొగిడినా తక్కువే.
'ఐదుగురు బౌలర్లతో వెళ్లాలనుకుంటే శార్దూల్‌ను ఎంపిక చేసుకోవడం బెస్ట్. పైగా ఏడో స్థానంలో అతడు బ్యాటింగ్ చేస్తాడు. అతడికి తోడుగా రవిచంద్రన్ అశ్విన్ ఉంటాడు' అని ప్రసాద్ అన్నారు. హైదరాబాదీ పేసర్ సిరాజ్‌కు నేరుగా చోటు దొరుకుతుందని ఆయన అంచనా వేశారు. ఈఏడాది అతడు 9 టెస్టుల్లో 18 వికెట్లు తీశాడు. 'మొదటి మ్యాచుకు నలుగురు బౌలర్లను తీసుకోవడం గ్యారంటీ. జస్ప్రీత్ బుమ్రా, షమి, అశ్విన్, సిరాజ్‌ను ఎంచుకుంటారు. సిరాజ్ ప్రస్తుత ఫామ్‌తో పోలిస్తే ఇషాంత్‌కు చోటు దొరకడం కష్టమే' అని ఎమ్మెస్కే పేర్కొన్నారు.
ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ కాంబినేషన్లో జట్టును ఎలా ఎంపిక చేస్తారోనని ఆసక్తి నెలకొంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీసులో టీమ్‌ఇండియా 1-0తో ఘన విజయం అందుకుంది. ఇప్పుడు సఫారీ సిరీసు రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురైంది. ఈ సిరీసు గెలిస్తే భారత్ చరిత్ర సృష్టిస్తుంది.
Also Read: IND vs SA: తొలిటెస్టుకు టీమ్‌ఇండియా జట్టు ఇలాగే ఉండొచ్చు..! విశ్లేషకుల అంచనా ఇదే
Also Read: India vs South Africa: హైదరాబాదీ సిరాజ్‌పై సచిన్ ప్రశంసలు.. ఎందుకంటే?
Also Read: IPL Auction 2022: ఐపీఎల్ వేలం తేదీలు వచ్చేశాయి..! ఫిబ్రవరిలోనే.. బెంగళూరులో
Also Read: Asian Champions Trophy Hockey 2021: పాకిస్థాన్ పై భారత్ గెలుపు.. ఖాతాలోకి కాంస్య పతాకం
Also Read: Virat Kohli Record: సఫారీ సిరీసులో కోహ్లీ బద్దలు కొట్టబోయే రికార్డులివే..! వందో టెస్టు..!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

