![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
INDIA vs SOUTH AFRICA : కుర్రాళ్లను స్పెషల్ డిన్నర్‌కు తీసుకెళ్లిన ద్రవిడ్.. ఆటగాళ్లంతా హ్యాపీ హ్యాపీ
రాహుల్ ద్రవిడ్ ఎంపికైన తర్వాత పరిస్థితులు మారుతున్నాయి! ఆటగాళ్లపై పనిభారం తగ్గించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. మైదానంలో కఠినంగా సాధన చేయిస్తూనే వారితో సమయం ఆస్వాదిస్తున్నాడు.
![INDIA vs SOUTH AFRICA : కుర్రాళ్లను స్పెషల్ డిన్నర్‌కు తీసుకెళ్లిన ద్రవిడ్.. ఆటగాళ్లంతా హ్యాపీ హ్యాపీ INDIA vs SOUTH AFRICA : BBQ night for the Indian cricket team in South Africa, Coach Rahul Dravid others enjoy dinner INDIA vs SOUTH AFRICA : కుర్రాళ్లను స్పెషల్ డిన్నర్‌కు తీసుకెళ్లిన ద్రవిడ్.. ఆటగాళ్లంతా హ్యాపీ హ్యాపీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/22/8e50912f088146db91316754bf05ebfc_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
టీమ్‌ఇండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ ఎంపికైన తర్వాత పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి! ఆటగాళ్లపై పనిభారం తగ్గించేందుకు అతడు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకవైపు మైదానంలో కఠినంగా సాధన చేయిస్తూనే మరోవైపు వారితో సమయం ఆస్వాదిస్తున్నాడు. అందరినీ బయటకు తీసుకెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు.
Nothing like a fiery BBQ night 🔥 pic.twitter.com/0S7h7be5ni
— Mayank Agarwal (@mayankcricket) December 21, 2021
తాజాగా క్రికెటర్లందరినీ రాహుల్ ద్రవిడ్ బయటకు తీసుకెళ్లాడు. వారితో కలిసి బార్బిక్యూ డిన్నర్ చేశాడు. ఆ తర్వాత సరదాగా గడిపారు. సాధారణంగా విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడు కుర్రాళ్లను సరదాగా బయటకు తీసుకెళ్లడం ద్రవిడ్ అలవాటు. ఇంతకు ముందు శ్రీలంకలో భారత జట్టు పర్యటించినప్పుడు శిఖర్ ధావన్‌తో పాటు మరికొందరితో అతడు డిన్నర్‌కు వెళ్లాడు.
Work mode on 💪🏏 pic.twitter.com/TjwvAGzTSp
— Mayank Agarwal (@mayankcricket) December 21, 2021
డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో టీమ్‌ఇండియా తొలి టెస్టు ఆడనుంది. ఇందుకోసం ఆటగాళ్లంతా మైదానంలో విపరీతంగా శ్రమిస్తున్నారు. ద్రవిడ్ నేతృత్వంలో నెట్స్‌లో కఠోర సాధన చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.
View this post on Instagram
📸 M🙂🙂D in the camp right now
— BCCI (@BCCI) December 21, 2021
All smiles here at Centurion 😃#TeamIndia | #SAvIND pic.twitter.com/IOaMfH6h7h
Also Read: IND vs SA: టెస్టు సిరీసు ముందు సఫారీలకు షాక్..! ఆ భయంకర పేసర్ సిరీసు నుంచి ఔట్!
Also Read: South Africa vs India: కోచ్ ద్రవిడ్ రికార్డుకే ఎసరు పెట్టిన కెప్టెన్ కోహ్లీ
Also Read: BWF Rankings: రెండేళ్ల తర్వాత టాప్-10లోకి కిదాంబి శ్రీకాంత్.. లక్ష్యకు కెరీర్ బెస్ట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)