(Source: ECI/ABP News/ABP Majha)
Virat Kohli Record: సఫారీ సిరీసులో కోహ్లీ బద్దలు కొట్టబోయే రికార్డులివే..! వందో టెస్టు..!
విరాట్ కోహ్లీ అరుదైన రికార్డులకు చేరువలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా సిరీసులో ద్రవిడ్, పాంటింగ్ రికార్డులు బద్దలు కొట్టనున్నాడు. అలాగే సెంచరీల కరవు తీర్చుకోవాలని తహతహలాడుతున్నాడు.
టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ అరుదైన రికార్డులకు చేరువలో ఉన్నాడు. దక్షిణాఫ్రికా సిరీసులో కొన్ని ఘనతలు సాధించేందుకు సిద్ధమయ్యాడు. ద్రవిడ్, పాంటింగ్ రికార్డులు బద్దలు కొట్టనున్నాడు. అలాగే సెంచరీల కరవు తీర్చుకోవాలని తహతహలాడుతున్నాడు. 2019లో కోహ్లీ సఫారీ గడ్డపైనే అత్యధిక వ్యక్తిగత స్కోరు 254* చేశాడు. మళ్లీ ఆ ఫామ్ అందుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. సెంచూరియన్ వేదికగా డిసెంబర్ 26న భారత్ తొలి టెస్టు ఆడనున్న సంగతి తెలిసిందే.
ద్రవిడ్ రికార్డులు
దక్షిణాఫ్రికాలో విరాట్ కోహ్లీ 12 మ్యాచులు ఆడాడు. 1075 పరుగులు చేశాడు. రాహుల్ ద్రవిడ్ (1252) స్కోరును అధిగమించేందుకు అతడు మరో 177 పరుగులు చేస్తే చాలు. సఫారీలపై అత్యధిక పరుగులు చేసిన మూడో భారతీయుడిగా నిలుస్తాడు.
8000 పరుగులు
టెస్టు కెరీర్లో విరాట్ కోహ్లీ 7801 పరుగులు చేశాడు. టీ20లు, వన్డేలతో పోలిస్తే అతడికి సుదీర్ఘ ఫార్మాట్ అంటేనే ఎంతో ఇష్టం. దక్షిణాఫ్రికాలో అతడు మరో 199 పరుగులు చేస్తే 8000 పరుగుల మైలురాయిని అందుకుంటాడు. చాలా తక్కువ మందే ఈ ఘనత సాధించడం గమనార్హం.
100వ టెస్టు
టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ 2019లో సెంచూరియన్‌లో సెంచరీ బాదేశాడు. అది అతడి కెరీర్లో 21వది. దాంతో ప్రొటీస్ గడ్డపై సచిన్ తర్వాత శతకం బాదిన రెండో భారతీయుడిగా విరాట్ రికార్డు సృష్టించాడు. ఇక్కడే వందో టెస్టు ఆడి అతడు దిగ్గజాల సరసన చేరనున్నాడు. దక్షిణాఫ్రికాపై మూడో టెస్టు కోహ్లీ ఆడబోయే సెంచరీ మ్యాచ్. దాంతో ఈ ఘనత సాధించిన 12వ భారతీయుడిగా నిలుస్తాడు.
సిరీస్ గెలిస్తే
సరికొత్త చరిత్ర సృష్టించేందుకు విరాట్ కోహ్లీకి అద్భుతమైన అవకాశం దొరికింది. దక్షిణాఫ్రికా గడ్డపై సఫారీలను ఓడించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ సిరీసులో టీమ్‌ఇండియా గెలిస్తే రెయిన్‌బో నేషన్‌లో తొలి టెస్టు సిరీసు గెలిచిన భారత కెప్టెన్‌గా సరికొత్త రికార్డు సృష్టిస్తాడు.
Also Read: IND vs SA: టెస్టు సిరీసు ముందు సఫారీలకు షాక్..! ఆ భయంకర పేసర్ సిరీసు నుంచి ఔట్!
Also Read: South Africa vs India: కోచ్ ద్రవిడ్ రికార్డుకే ఎసరు పెట్టిన కెప్టెన్ కోహ్లీ
Also Read: BWF Rankings: రెండేళ్ల తర్వాత టాప్-10లోకి కిదాంబి శ్రీకాంత్.. లక్ష్యకు కెరీర్ బెస్ట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి